Home » Health Science » రాత్రి పడుకునే ముందు బొడ్డులో ఆవాల నూనె వేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
రాత్రి పడుకునే ముందు బొడ్డులో ఆవాల నూనె వేస్తే ఏం జరుగుతుందో తెలుసా!

మనిషి శరీరానికి కేంద్ర స్థానం బొడ్డు. బిడ్డ తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు పోషకాలు అన్నీ బొడ్డు ద్వారానే అందుతాయి. అందుకే బొడ్డును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బొడ్డు ఆరోగ్యంగా లేకపోతే కడుపు చాలా తొందరగా అప్సెట్ అవుతుంది. బొడ్డు ఆరోగ్యం కోసం ఆవనూనె చాలా ఆరోగ్యకరమైనదిగా పేర్కొంటారు. ఈ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 , ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E ఉంటాయి. రోజూ పడుకునే ముందు నాభికి ఆవనూనె రాసుకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెబుతాయట. ఇంతకీ అవేంటో.. బొడ్డులో ఆవాల నూనె రాయడం వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే..
వెచ్చదనం..
శరీరం చలువ స్వభావం ఉన్నవారు బొడ్డులో ఆవాల నూనె వేసుకోవడం చాలా మంచిది. ఆవ నూనెను నాభికి పూయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది, ఎందుకంటే ఆవ నూనె సహజంగానే వేడి చేసే గుణం కలిగి ఉంటుంది.
కడుపు ఆరోగ్యం..
నేటి జీవనశైలి వల్ల చాలా మంది కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలతో బాధపడటం సాధారణం అయింది. అలాంటి సమస్యలు ఉన్నవారు ప్రతి రాత్రి పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయాలి, ఎందుకంటే నాబి ప్రాంతం ప్రేగులకు అనుసంధానించబడి ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
కీళ్ల నొప్పులు..
ఆవ నూనెలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. శీతాకాలంలో తరచుగా కీళ్ల నొప్పులు ఎదుర్కునేవారు పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయాలి. ఇది మంటను చాలా వరకు తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తి..
నేటికాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని చెబుతూ ఉంటారు. ఏ చిన్న ఇన్ఫెక్షన్లకు అయినా చాలా తొందరగా ఇబ్బంది పడతారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటే తరచుగా అనారోగ్యానికి దారితీస్తుంది. పడుకునే ముందు నాభికి ఆవ నూనెను పూయడం వల్ల రోగనిరోధక శక్తి మూలాల నుండి బలపడుతుంది. ఇది ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కొన్ని రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి.
నిద్ర సమస్యలు..
నిద్ర సమస్యలతో బాధపడేవారు పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాసుకోవాలి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే తగినంత నిద్ర లేకపోతే, అది రోగనిరోధక శక్తి బలహీనపడటం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
చర్మ ఆరోగ్యం..
పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేయడం. ఇది ముడతలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఆవ నూనెలో విటమిన్ E ఉంటుంది, ఇది చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది.
ఆవనూనెను బొడ్డుకు రాయడం వల్ల మంచి ఫలితాలు లభించాలంటే.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం నెలరోజులు అయినా దాన్ని రాత్రి పడుకునే ముందు బొడ్డు మీద రాయాలి.
*రూపశ్రీ.
