Home » Fashion » ఇలాంటి దుస్తులతో జాగ్రత్త.. వీటిని ధరిస్తే ఇంకా లావుగా కనిపిస్తారట..!
ఇలాంటి దుస్తులతో జాగ్రత్త.. వీటిని ధరిస్తే ఇంకా లావుగా కనిపిస్తారట..!

ఇప్పటి తరం వారు ప్రతి ఒకటి పర్పెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అది తినే ఆహారం అయినా, ధరించే దుస్తులు అయినా, వేరే ఏ ఇతర విషయం అయినా.. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా.. ప్రధానంగా ఉండేవి దుస్తులు. దుస్తులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా సమయం గడుపుతారు. అయితే అమ్మాయిలు ఎంచుకునే దుస్తులు వారి అందాన్ని మెరుగుపరుస్తే సంతోషమే.. కానీ వారి ఎంపిక బెడిసి కొడితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మంది కంటికి నచ్చిన దుస్తులను ఎంచుకుంటారు. కానీ అందరూ చేయాల్సింది ఏంటంటే.. కంటికి నచ్చింది సెలెక్ట్ చేసుకోవడం కాదు.. శరీర ఆకృతిని బట్టి దుస్తులను సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. కొన్ని రకాల దుస్తులు వేసుకుంటే ఉన్న దానికంటే ఎక్కువ లావుగా కనిపిస్తారట. ఆ దుస్తులు ఏంటో.. తెలుసుకుంటే..
చాలా టైట్, లూజ్..
చాలా బిగుతుగా ఉండే దుస్తులు కొన్ని శరీర భాగాలను హైలైట్ చేస్తాయి, అలాగే చాలా వదులుగా ఉండే దుస్తులు ఆ శరీరాన్ని ఇంకా ఎక్కువ లావుగా కనిపించేలా చేస్తాయి. మీడియం-ఫిట్ అవుట్‌ఫిట్ లేదా "పర్ఫెక్ట్ ఫిట్" అనేది మంచి ఎంపిక. ఇది లుక్‌లో బాలెన్సింగ్ ను కాపాడుతుంది.
ఫిట్ గా, బాలెన్స్డ్ గా..
సరైన కత్తిరింపు, మంచి ఆకృతిలో కుట్టిన దుస్తులు బాగా ఫిట్ గా ఉన్న దుస్తులు శరీరానికి సరైన ఆకృతిని ఇస్తాయి. సరైన సైజులో ధరించడం వల్ల చక్కగా, స్మార్ట్‌గా కనిపిస్తారు. నిజానికి వస్త్రధారణ బాగుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగ్గా ఉంటుంది.
రంగులు..
ముదురుగా ఉన్న రంగులు, చాలా స్ట్రాంగ్ రంగులు అయిన నేవీ బ్లూ, నలుపు, ముదురు ఆకుపచ్చ లేదా మెరూన్ వంటివి లుక్ పరంగా శరీరాన్ని బాలెన్స్ చేస్తాయి. ఈ రంగులు చూడటానికి ముచ్చటగా ఉండేలా చేయడంతో పాటు శరీరాన్ని కూడా సన్నగా కనిపించేలా చేయడంలో సహాయపడతాయి.
తేలిక..
కాటన్, రేయాన్, జార్జెట్ లేదా లినెన్ వంటి తేలికైన బట్టలు శరీరంపై భారంగా అనిపించవు. ఈ బట్టలు ధరించడం కూడా సులభంగా ఉంటుంది. లుక్ సహజంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
డిజైన్లు..
నిలువు చారలు లేదా లైనింగ్‌లతో కూడిన దుస్తులు పొడవుగా కనిపించేలా చేస్తాయి. దీని వల్ల శరీరం బాలెన్స్డ్ గా కనిపిస్తుంది. సింపుల్ గా ఉన్న డిజైన్లు అతిగా హెవీగా ఉండే ప్రింట్ల కంటే మరింత క్లాసీ లుక్‌ను ఇస్తాయి.
ముఖ్యమైన విషయం..
ఫ్యాషన్ లో ఉండే అతి ముఖ్యమైన నియమం సౌకర్యం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే.. మనుసుకు హాయిని, సంతోషాన్ని ఇచ్చే దుస్తులు చాలా మంచి దుస్తులు. కాబట్టి ఏదైనా బాగుంది అనిపిస్తే దానిని సంకోచం లేకుండా ధరించవచ్చు. అయితే ఇతరుల మాటల గురించి, ఇతర విషయాల గురించి పట్టించుకోకుండా, ఆలోచించకుండా ఉండేలా అయితేనే ఇది సంతోషాన్ని ఇస్తుంది. లేకపోతే మనశ్శాంతి లేకుండా చేస్తుంది.
*రూపశ్రీ.
