Home » Ladies Special » Nancy tyagi success journey,Nancy tyagi,nancy tyagi story of success,nancy tyagi story,Delhi fashion influencer Nancy Tyagi,A TV technician Daughter,Nancy Tyagi 



ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్ది. ట్యాలెంట్ ఉండాలే కానీ తళుక్కున మెరవచ్చు. చాలామంది ఏ రంగం అయినా బ్యాక్గౌండ్ లేకపోతే ముందుకు సాగలేరని అంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఎదగాలంటే చాలా సవాళ్లు ఎదుర్కోవాలని కూడా అంటుంటారు. దీనికి ఉదాహరణగా చాలామంది మహిళలు తమకు ఎదురైన అనుభవాలు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం అన్నింటిని తట్టుకుని నిలబడి విజయ కేతనం ఎగురవేస్తారు. ఆ కోవలోకి చెందినదే నాన్సీ త్యాగి. ఈమె ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లూమెన్సర్. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈమె తన ఫ్యాషన్ ప్రతిభతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిసింది. ఇలాంటి  విజయాలు ఎంతో మంది మహిళలను, యువతులను ఇన్పైర్ చేస్తాయి.  విజయం వైపు నాన్సీ త్యాగి  ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుంటే..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్,  కియారా అద్వానీ వంటి  సెలబ్రిటీలు సాధారణంగా తమ ఫ్యాషన్ తో హోయలు పోయి ప్రశంసలు కొట్టేసేవారు. కానీ  దానికంటే ఎక్కువ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికి  ప్రశంసలు లభిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన నాన్సీ త్యాగి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తను సొంతంగా డిజైన్ చేసిన గౌనుతో ఈవెంట్ కు అట్రాక్షన్ గా నిలిచి ప్రశంసలు కొట్టేసింది. ఈమె ధరించిన  గౌను ఫ్యాషన్ ప్రపంచంలో  ఈమెకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. నాన్సీ త్యాగి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో  పింక్ రఫుల్ గౌను ధరించింది. దీన్ని తయారు చేసేందుకు ఆమెకు  1000 మీటర్ల క్లాత్ అవసరమైంది. దీన్ని నెల రోజుల్లో సిద్ధం చేసినట్టు పేర్కొంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోలు పోస్ట్ చేస్తుండేది. అవి కాస్తా  వైరల్ కావడంతో  నాన్సీ త్యాగికి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు వచ్చింది. నాన్సీ స్వయంగా డ్రెస్ కుట్టించి తన అకౌంట్ లో  పోస్ట్ చేసేది. మొదట్లో నాన్సీ తన డిఫరెంట్  శైలి ప్రెజెంట్ చేసే క్రమంలో చాలా ట్రోల్స్ కు గురైంది.  దీంతో ఆమె పోస్టింగ్ శైలిని మార్చుకుంది. అంతే..  నెటిజన్లు ఆమె ట్యాలెంట్ ను గుర్తించడం  మొదలుపెట్టారు.  ప్రస్తుతం  ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది నాన్సీని ఫాలో అవుతున్నారు.   ఆమె ఇయర్ పోస్ట్‌కు 1.9 మిలియన్ లైక్‌లు ఉన్నాయి. నాన్సీ ప్రతిభ ఆమెను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లింది. నాన్సీ స్వయంగా కుట్టిన దుస్తులను సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, ఈషా గుప్తా, దేవోలీనా భట్టాచార్జీ వంటి పలువురు ప్రముఖులు..  సోషల్ మీడియా ప్రభావశీలులు ప్రశంసించారు.  అంతేనా నాన్సీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్లడం మాత్రమే కాకుండా గుర్తింపు తెచ్చుకున్నందుకు నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేక ఈవెంట్ కోసం నాన్సీ మూడు లుక్స్ లో కనిపించింది.  తన ఫస్ట్ లుక్‌లో నాన్సీ పింక్ రఫిల్డ్ గౌనులో  కనిపించగా, సెకండ్ లుక్‌లో ఆమె హెడ్ ఎంబ్రాయిడరీ చీరను ధరించింది.  ఈ చీరను స్వయంగా తనే సిద్ధం చేసింది.

తన మూడవ లుక్ లో  నాన్సీ నల్లటి దుస్తులను ధరించింది. ఇది కూడా ఆమె స్వయంగా   స్టైల్ చేసింది. నాన్సీ స్వయంగా ఈ  దుస్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

                        *నిశ్శబ్ద.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.