Home » Beauty Care » ముల్తానీ మట్టిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే చాలు.. ముఖం అద్దంలా మెరుస్తుంది..!

ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ నేటి కాలంలో మార్కెట్లో ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ముఖాన్ని అద్దంలా మెరిపిస్తుందని యాడ్స్ లోనూ, ప్రమోషన్స్ లోనూ వైరల్ అవుతుంటాయి. కానీ ఇవి చూడటానికి ఉన్నంత ఆకర్షణగా.. మంచి ఫలితాన్ని అయితే ఇవ్వలేవు. అందుకే చాలా వరకు ఇంటి చిట్కాలే నయం అని, కొన్ని చిన్న టిప్స్ తో చక్కని ఫలితాలు పొందవచ్చని చెబుతారు. చాలామంది స్కిన్ కేర్ లో ముల్తానీ మట్టి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టి చర్మంపై ఉన్న అధిక నూనె, దుమ్ము , మురికిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అయితే, దీనిని సహజ పదార్థాలతో కలిపినప్పుడు, దాని ప్రభావాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇది చర్మం సహజ కాంతిని కాపాడుకోవడంలో సహాయపడుతుందని చెబుతారు. ముల్తానీ మట్టిని ఏ పదార్థాతో కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే..
రోజ్ వాటర్, ముల్తానీ మట్టి..
జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌తో కలిపి అప్లై చేయడం చాలా మంచిది. పేస్ట్ తయారు చేయడానికి, 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని 2 నుండి 4 టీస్పూన్ల రోజ్ వాటర్‌తో కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు సున్నితంగా అప్లై చేసి, ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి, తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ అధిక జిడ్డును నియంత్రించడానికి, చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి , చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడుతుంది.బెస్ట్ రిజెల్ట్స్ కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి 1 నుండి 2 సార్లు అప్లై చేయవచ్చు.
ముల్తానీ మట్టి, పెరుగు..
ముఖం పొడిబారి, కాంతిహీనంగా లేదా నల్లబడినట్లయితే, తాజా పెరుగుతో కలిపిన ముల్తానీ మట్టిని ఫేస్ ప్యాక్ లా వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని 1 నుండి 2 టీస్పూన్ల తాజా పెరుగుతో కలిపి చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లే చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాల. ఆ తర్వాత మెల్లగా మసాజ్ చేసి, మామూలు నీటితో కడిగేయాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని మునుపటి కంటే శుభ్రంగా , మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
ముల్తానీ మట్టి, తేనె..
పొడి , సాధారణ చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి , తేనె మిశ్రమంతో చేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసుకోవచ్చు. అవసరమైతే, కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖానికి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచుకుని, ఆ తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. తేనె చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది, దీనివల్ల పొడిబారడం తగ్గుతుంది. ఇది ముఖం సహజ కాంతిని నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది, దీనివల్ల ముఖం మునుపటి కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ముల్తానీ మట్టి, అలోవెరా జెల్..
సున్నితమైన చర్మం ఉన్నా లేదా ఎండవల్ల చర్మం కమిలిపోయినా, తాజా కలబంద జెల్‌తో కలిపిన ముల్తానీ మట్టిని ప్యాక్ లా వేసుకోవడం ప్రయోజనకరం. 2 టీస్పూన్ల ముల్తానీ మట్టితో 1-2 టీస్పూన్ల కలబంద జెల్‌ను కలిపి పేస్ట్ లాగా తయారుచేసి, దానిని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత, మామూలు నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి ఉపశమనం కలిగించి, చర్మ చికాకును తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
ముల్తానీ మట్టి, పసుపు..
చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, ముల్తానీ మట్టిలో చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. పసుపులో యాంటీఆక్సిడెంట్ , యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ముల్తానీ మట్టి చర్మం నుండి అదనపు నూనె , మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. పసుపు ఎక్కువ వాడితే చర్మం పసుపు రంగులో కనిపిస్తుంది. కాబట్టి పసుపును తక్కువగా వేసుకోవడం మంచిది.
*రూపశ్రీ.
