Home » Beauty Care » జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలా.. ఈ ఒక్క సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు..!

జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలా.. ఈ ఒక్క సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు..!


జుట్టు రాలడం, పలచబడటం, నెమ్మదిగా పెరగడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు నేటి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. జుట్టుకు రంగు వేసినంత సులువుగా జుట్టు పర్మినెంట్ గా నల్లా అవ్వదు. అయినా సరే..  సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో, చిట్కాలతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.  వందలు, వేలు పోసి హెయిర్ ఆయిల్స్,  విటమిన్ సప్లిమెంట్లు,  హెయిర్ ప్యాక్ లు,  హెయిర్ కేర్  ట్రీట్రెంట్ లు తీసుకున్నా సరే.. జుట్టు తిరిగి నల్లబడటం,  ఒత్తుగా పెరగడం వంటివి అంత సులువుగా జరగవు. అయితే ఇంట్లోనే జుట్టు అన్ని సమస్యలకు చెక్ పెట్టి, జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేసే చిట్కా ఒకటుంది.  ఇది తయారు చేసుకోవడం,  వాడటం కూడా చాలా సులువు.  అదేంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా వాడాలో తెలుసుకుంటే..

హెయిర్ గ్రోత్ పౌడర్..

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి,నల్లగా మారడానికి,  ఒత్తుగా పెరగడానికి ఇంట్లోనే హెయిర్ గ్రోత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు..

గుంటగలర ఆకు..
బెల్లం లేదా కండ చక్కెర..
నల్ల నువ్వులు..

గుంటగలర ఆకు..

ఆయుర్వేదంలో గుంటగలరను భృంగరాజ్‌గా కూడా పిలుస్తారు. జుట్టు సంరక్షణలో బృంగరాజ్ చాలా ప్రసిద్ధి చెందింది.   జుట్టు నల్లగా ఉండేందుకు, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు, తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. భృంగరాజ్‌లో ఉండే కొన్ని సహజ రసాయనాలు జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

నువ్వులు..

నువ్వులు అనేక పోషకాలకు నిలయం, నువ్వులలో  ప్రోటీన్,  కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం,  విటమిన్ B సమూహానికి చెందిన కొన్ని పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఈ పోషకాలు శరీర ఆరోగ్యంతో పాటు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించడంలో సహాయపడతాయి.

బెల్లం లేదా కండ చక్కెర..

బెల్లంలో కొంతమేరకు ఐరన్, ఖనిజాలు ఉంటాయి. రుచిని మెరుగుపరుస్తుంది.  కండ చక్కెర సాధారణ పంచదార కంటే భిన్నంగా ఉంటుంది.  ఇది తీపిని ఇస్తూ శరీరానికి చలువ చేస్తుంది.

హెయిర్ గ్రోత్ పౌడర్..

 గుంటగలర ఆకు పొడి – 100 గ్రాములు
 వేయించిన నువ్వుల పొడి – 100 గ్రాములు
 బెల్లం పొడి లేదా కండ చక్కెర పొడి – 100 గ్రాములు

తయారీ విధానం..

అన్ని పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి.వీటిని వంద గ్రాముల మోతాదులో కాకపోయినా కనీసం వీలైనంత వరకు సమాన పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది.

ఎలా తీసుకోవాలి?

పైన తయారు చేసుకున్న పౌడిని ఉదయం ఒక టీ స్పూన్,  సాయంత్రం ఒక టీ స్పూన్ పొడిని నేరుగా నోట్లో వేసుకుని గ్లాసు మంచినీరు తాగాలి.  లేకపోతే గోరు వెచ్చని పాలు అయినా తాగవచ్చు.

ప్రతి రోజూ పైన చెప్పకున్న హెయిర్ గ్రోత్ పౌడర్ ను కనీసం నెల రోజులు అయినా కంటిన్యూగా వాడుతుంటే నెల రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.

 

                                 *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.