Home » Health Science  » మహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తే ఆరోగ్యం నాశనమే..!

మహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తే ఆరోగ్యం నాశనమే..!

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే  మంచి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే చాలని అనుకుంటారు. కానీ మహిళలు రోజూ ధరించే దుస్తులు కూడా మహిళల  ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావం చూపుతాయి.  ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. చాలామంది ఫ్యాషన్, ట్రెండ్స్ వెనుక పడి శరీరానికి ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామో గమనించరు. సరైన దుస్తులు ఎంచుకోకపోవడం వల్ల శరీరానికి తెలియకుండానే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారం ఎంత ముఖ్యమో, మనం రోజూ వేసుకునే దుస్తులు కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని దుస్తుల ఎంపిక పొరపాట్లు , వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుంటే..

బిగుతుగా ఉండే దుస్తులు..

నేటి కాలంలో చాలామంది శరీరాన్ని అతుక్కుని ఉండే విధంగా ఉండే బిగుతు దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్కిన్ టైట్ టీ-షర్టులు, టైట్ జీన్స్, బిగుతైన బెల్టులు , శరీరానికి గాయాలు లేదా గుర్తులు పడేలా ఉండే లోదుస్తులు వేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. శరీరానికి బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాలు నొక్కివేసినట్టు అవుతాయి.   దీనివలన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అంతేకాకుండా కణజాలాలకు అందాల్సిన ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్ళలో నొప్పులు, జీర్ణసంబంధమైన సమస్యలు, చర్మ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడూ శరీరానికి గాలి ఆడేలా, సౌకర్యవంతంగా ఉండే  దుస్తులను ఎంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

సింథటిక్ వస్త్రాలు..

మార్కెట్లో లభించే అనేక దుస్తులలో సింథటిక్ ఫైబర్లు ఎక్కువగా వాడుతుంటారు. నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్, లైక్రా , రేయాన్ వంటివి సింథటిక్ దుస్తుల కిందకు వస్తాయి. ఈ సింథటిక్ ఫైబర్లను తయారు చేయడానికి పెట్రోలియం రసాయనాలను ఉపయోగిస్తారు. వీటితో చేసిన బట్టలను మనం రోజంతా వేసుకోవడం వల్ల, ఆ రసాయనాలు నెమ్మదిగా చర్మం ద్వారా శరీరంలోకి ఇంకిపోయే ప్రమాదం ఉంది. ఇవి చర్మానికి గాలి తగలకుండా చేసి చెమటను పట్టి ఉంచుతాయి, దానివల్ల చర్మ అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటి స్థానంలో కాటన్, లినెన్, హెచ్‌ఎంపి , బాంబూ, , జనపనార వంటి సహజసిద్ధమైన పీచుతో చేసిన వస్త్రాలను ధరించడం చర్మానికి ఎంతో సురక్షితం.

అండర్ వైర్ బ్రాలు..

మహిళలు ఉపయోగించే లో దుస్తుల  విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అండర్ వైర్ ఉండే బ్రాలను ఎక్కువగా వాడటం వల్ల రొమ్ము భాగంలో రక్తప్రసరణ తీవ్రంగా దెబ్బతింటుంది. అండర్ వైర్ లో ఉండే  వైర్ల వల్ల ఒత్తిడి పెరిగి ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టడం లేదా రక్తప్రసరణ నిలిచిపోవడం జరుగుతుంది. ఇది సుదీర్ఘ కాలంలో తీవ్ర అసౌకర్యానికి , ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మెటల్ లేదా ప్లాస్టిక్ వైర్లు లేని, సాధారణ కాటన్ మెటీరియల్‌‌తో చేసిన వైర్-ఫ్రీ బ్రాలను వాడటం వల్ల శరీరానికి సౌకర్యంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

 మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం..

మహిళలు ధరించే దుస్తులు కేవలం  అందాన్ని పెంచడానికే కాకుండా,  శరీరానికి హాయిని, ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలి. అనవసరమైన ట్రెండ్స్ వెనుక పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కంటే, శరీరానికి సరిపడే సహజమైన,  అనుకూలంగా ఉన్న  దుస్తులను ఎంచుకోవడమే మంచిది. ఆరోగ్యకరమైన బట్టల వల్ల  రోజంతా హుషారుగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.


                               *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.