జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తెలుగిళ్ళల్లో సీరియల్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో నటించేవాళ్లకు కూడా ఆడియన్స్ బ్రహ్మరధం పడతారు. ఇక ఇప్పుడు ఈ అవార్డ్స్ కి వేదిక సిద్ధం కాబోతోంది. "ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు, ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన మన కళాకారులు, వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఒక అద్భుతమైన వేడుక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ " అంటూ రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇక ఇప్పుడు మధ్యాహ్నం మహా సీరియల్ పేరుతో మరో ప్రోమో వచ్చేసింది. "ముక్కుపుడక, ఉమ్మడి కుటుంబం, దీర్ఘసుమంగళీభవ, గుండమ్మ కథ, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, ఎన్నాళ్ళో వేచిన హృదయం" అంటూ మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే సీరియల్స్ పేర్లు చెప్పి ఓటు చేయడానికి స్క్రీన్ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి వోట్ చేయాలని కోరారు.
గుండమ్మ కథ సీరియల్ బాగా పాపులర్. 2018 లో మొదలయ్యింది. విజయవంతంగా నడుస్తూ అత్యధిక ఆదరణ పొందింది. ముక్కుపుడక 2022 లో ప్రారంభమై మంచి వీక్షక ఆదరణతో దూసుకుపోతోంది. కలవారి కోడలు కనక మహాలక్ష్మి 2024 లో ప్రారంభమైన లేడీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఉమ్మడి కుటుంబం 2024 లో విడుదలైన సరికొత్త కుటుంబ కథాచిత్రం. సంప్రదాయాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగుతూ ప్రజాదరణ పొందుతోంది. ఎన్నాళ్ళో వేచిన హృదయ2025 లో సరికొత్త కథాంశంతో ప్రారంభమై, మంచి ఆదరణ సంపాదించుకుంది. దీర్ఘసుమంగళీభ2025 లో విడుదలైన మంచి డ్రామా , ట్విస్టులతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది. మరి ఆడియన్స్ ఏ సీరియల్ కి పట్టం కట్టి మొదటి ప్లేస్ లో నిలబెడతారో చూడాలి.
[zee telugu kutumbam awards 2026, awards to tv serials, zee telugu kutumbam awards 2026 promo]




