.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-103లో అంజలి స్పృహలోకి వచ్చి భయపడుతుంది. మరోవైపు అమ్మకి అంజలి గురించి అసలు తెలియడానికి వీల్లేదు.. అమ్మ టెన్షన్ పడుతుందని ఇంట్లో వాళ్లకి గీత చెప్తుంది. అప్పుడే అంజలి అంటూ రత్నం ఎంట్రీ ఇస్తుంది. పొద్దున నుంచి అంజలి కనిపించడం లేదని అడుగుతుంది. అంజలి ఇంట్లో లేదు.. బయటకు వెళ్లిందని గీత అంటుంది. బయటకు పొద్దున వెళ్లి ఇంకా రాలేదా అని రత్నం అడగ్గా, మనీష్ వరంగల్ వెళ్లాడు.. అది విని అంజలి వెయ్యి స్తంభాల గుడి చూస్తానంది.. దాంతో నేను మనీష్‌తో తనని పంపించాను.. రేపు వస్తారని గీత కవర్ చేస్తుంది. మనీష్‌తో వెళ్లిందా అని రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత ఇప్పుడే ఇలా చెప్పావ్.. తర్వాత అంజలి గురించి తెలిస్తే అని భవిత అనగానే అంజలి డిశ్చార్జ్ అయి వచ్చాక చెప్తే పర్వాలేదు..అప్పుడు అంజలి కళ్ల ముందు కనిపిస్తుంది కాబట్టి అమ్మ అంత టెన్షన్ పడదని గీత అంటుంది. అంజలికి స్పృహ వచ్చిందా అని రాకీ అడుగుతాడు. అంజలికి స్పృహ వస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని గీత అనగానే అసలు మన ఇంట్లో ఇవన్నీ జరగడం ఏంటని భాను అంటుంది. ఎవరు చేసినా కచ్చితంగా వాళ్లకి శిక్ష పడాల్సిందే అని గీత అనగానే రాకీ, రోహిత్ టెన్షన్ పడతారు.
మరోవైపు అంజలి దగ్గరికి మిమిక్రీ చేస్తూ మనీష్ వెళ్లి తనని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. అసలు తనకి అలా అవడంతో మనీష్ ఎమోషనల్ అవుతాడు. మరోవైపు అంజలి స్పృహలోకి వస్తే మన గురించి చెప్తుందేమో అని రాకీ, రోహిత్ భయపడతారు. కచ్చితంగా వాళ్ల గురించి చెప్పాలి.. లేదంటే ఇలాగే తప్పు చేస్తారని అంజలి జరిగింది గుర్తుచేసుకుంటుంది.
తరువాయి భాగంలో అంజలి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. అప్పుడే పోలీసులు కూడా వస్తారు. అంజలి జరిగింది మొత్తం చెప్పిందనగానే రోహిత్, రాకీ టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
