Home

»

Tv News

Ye Devi Varamo Neevu: జీతం ఇచ్చిన గీత.. ఎమోషనల్ అయిన అంజలి, బ్యాంక్ అకౌంట్ కోసం మనీష్ హెల్ప్!

Oct 23, 2026 12:41PM

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-97 లో.. మనీష్, అంజలి ఇద్దరు చాలాదూరం వెళ్తున్నారు‌.. అంజలిని ఇంటి నుండి పంపించేయాలని భవిత అనుకుంటుంది. అదే సమయంలో మంత్ ఫస్ట్ కావడంతో అందరికి పాకెట్ మనీ కోసం గీత దగ్గరికి వస్తారు. అందరికి పాకెట్ మనీ ఇస్తుంది గీత. భవిత, రోహిత్ లతో పాటు రాకీ వాళ్ళకి కూడా పాకెట్ మనీ ఇవ్వడంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే సమయంలో ఇంట్లో పనిచేసేవాళ్ళకి కూడా మనీష్ ని జీతాలు ఇయ్యమంటుంది గీత. 

జీతాలు అందరికి ఇస్తాడు మనీష్. అయితే అంజలికి ఇవ్వకపోవడంతో గీత అడుగుతుంది. అంజలి వంట బాగుంటుందని అందరు అన్నారు కదా.. మరి ఆమెకి ఎందుకు జీతాలు ఇవ్వలేదని గీత అడుగడంతో మర్చిపోయాను అత్తయ్య అని మనీష్ అంటాడు‌. ఇక అంజలిని గీత పిలుస్తుంది. దాంతో పరుగున కిచెన్ లో నుండి వస్తుంది అంజలి‌. అమ్మగారు మీరు పిలిచారా అని అడుగుతుంది. ఏ నేను పిలవకూడదా అని గీత అనగానే పిలవొచ్చు.‌ ఎలాగైనా పిలవవచ్చు ఎందుకైనా పిలవొచ్చు అని అంజలి అంటుంది. అంజలికి పదివేలు జీతం ఎక్కువ ఇవ్వు మనీష్  అనగానే నాకు వద్దు అని అంజలి అంటుంది. ఎందుకని అడుగగా అమ్మగారి చేతులమీదుగా తీసుకోవాలని అనుకుంటున్నానని అంజలి అంటుంది. దాంతో గీత ఇస్తుంది. అంజలి ఎమోషనల్ అవుతుంది. ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావని గీత అడుగగా నాకు జీతం ఇచ్చారు కదా అని అని అంజలి అంటుంది. 

నీకు జీతం మాత్రమే ఇచ్చింది. ఏదో జీవితం ఇచ్చినట్లు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావని భవిత అంటుంది. జీతమిచ్చే అమ్మగారే నాకు జీవితమిస్తున్నారంటూ కవర్ చేస్తుంది అంజలి. ఇక అంజలి అలా మాట్లాడేసరికి ఎందుకిలా చేస్తున్నావ్.. పాత సినిమాలు ఎక్కువగా చూస్తావా అని గీత అనగానే లేదని అంజలి అంటుంది. సరే డబ్బులు జాగ్రత్తగా దాచుకొని బుద్దిగా పనిచేస్కోమని చెప్పి గీత వెళ్లిపోతుంది. ఇక అంజలి ముసలమ్మ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మనీష్ ఆఫీస్ కి వెళ్తుంటే అంజలి తన దగ్గరికి వెళ్లి నీకు లెక్కలు రావా అని అంటుంది. ఎందుకలా అడిగావని మనీష్ అడుగగా మరి నీ దగ్గర నుండి రెండు వేలు తీసుకున్నా కదా మరి అవి కట్ చేసుకొని ఇవ్వాలి కదా అని అంజలి అనగానే నువ్వు రేర్ అని మనీష్ అంటాడు. నువ్వు కూడా రేర్ అని అంజలి అంటుంది. నేను ఈ డబ్బులు దాచుకోవాలి.. నాకు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి బ్యాంక్ కి తీసుకెళ్ళమని అంజలి అడుగగా అవసరం లేదు నా ల్యాప్ టాప్ లో అప్లై చేయొచ్చని మనీష్ అంటాడు. ఇక అంతా ఫిల్ చేసి అప్లోడ్ చేస్తుంటే సర్వర్ స్లోగా ఉంటుంది. అవ్వట్లేదని మనీష్ అంటే ఇది డబ్బా కంప్యూటర్ పడేస్తానని అంజలి అనగానే మనీష్ కోప్పడతాడు. అంజలి,  మనీష్ మధ్య సరదాగా మాటల యుద్ధం జరగుతుంది. మనీష్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com