
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -84 లో మనీష్ కి అసలు విషయం చెప్తానని అంజలి వెళ్తుంటే రాకీ అడ్డువచ్చి ఆపుతాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ .. ఇప్పుడు మా అన్నయ్యకి నిజం చెప్పడానికి వెళ్తున్నావా.. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా నన్ను చంపేస్తాడు ప్లీజ్ ఈ విషయం చెప్పొద్దని అంజలి కాళ్లు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాడు.
దీంతో అంజలి వెనక్కి వెళ్తుంది. రాకీ తన గదికి వెళ్లేసరికి మనీష్ అక్కడ ఉంటాడు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్లానని రాకీ చెప్తాడు. రోహిత్ తాగి వచ్చాడు దాని వెనక నీ హస్తం ఏమైనా ఉందా అని మనీష్ అడుగుతాడు. లేదు అన్నయ్య నేను అలాంటి వాటి జోలికి కూడా పోనని రాకీ అంటాడు. సరే మన ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరికైనా డ్రింక్ అలవాటు ఉందో కనుక్కో .. రోహిత్ ఎందుకు ఇలా అయ్యాడు అత్తయ్య ఎంత బాధపడుతుందో చూశావ్ కదా అని మనీష్ అనగానే సరే అన్నయ్య అని రాకీ యాక్టింగ్ చేస్తాడు.
ఆ తర్వాత మరుసటి రోజు రోహిత్ ని గీత ఎందుకు డ్రింక్ చేశావని కొడుతుంది. అప్పుడే అంజలి.. ఆపండి అమ్మగారు రోహిత్ తప్పేం లేదు అని లోపలికి రాబోతుంది, గీత తనని ఆపి బయటే ఉండి చెప్పు అంటుంది దీంతో అంజలి బయటే ఆగిపోతుంది. రాకేష్ బాబు వల్లే రోహిత్ చెడిపోతున్నాడు అని అంజలి చెప్పగానే మనీష్ బెల్ట్ తో రాకీని కొడుతాడు.
అన్నయ్య ఒక పనిమనిషి చెప్తే నమ్ముతావా నా మాట వినవా, మేం పార్టీకి వెళ్లాము అక్కడ మా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో మందు కలిపారు అది కూల్ డ్రింక్ అనుకొని రోహిత్ తాగాడు అని రాకీ కథ అల్లుతాడు. అంజలి చెప్పిన నిజాన్ని మనీష్ నమ్ముతాడా, రాకీ తప్పించుకుంటాడా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
