Home

»

Tv News

అంజలిని బ్లాక్ మెయిల్ చేసిన రాకీ.. తాగి రోడ్డున పడ్డ రోహిత్!

Oct 7, 2026 10:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'ఏ దేవి వరమో నీవు' సీరియల్ మంగళవారం నాటి 83వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. గీత అన్న మాటలకు అంజలి బాధపడుతుంది. మరోవైపు మనీష్ ఆలోచిస్తుంటే భవిత చూసి.. బావ ఏం ఆలోచిస్తున్నాడు.. కొంపదీసి నాపై డౌట్ వచ్చిందా అని టెన్షన్ పడుతుంది. దగ్గరకు వెళ్లి బావ రేపు సినిమాకి వెళ్దామా అని అడుగుతుంది. దీనికి మనీష్ కోపంగా అసలు నీకు ఇంట్లో పరిస్థితితో సంబంధం ఉండదా అని కోప్పడతాడు. నానమ్మకి అలా అయింది.. అంజలి పరిస్థితి అలా ఉందని మనీష్ అంటాడు. అంజలి దొంగతనం చేసింది అలా ఉందని భవిత అనగానే ఇండైరెక్ట్ గా తనకి కౌంటర్ ఇచ్చేలా మనీష్ మాట్లాడడంతో భవిత టెన్షన్ పడుతుంది.

మరోవైపు అంజలి ఉన్న దగ్గరకు రోహిత్ వెళ్లి డోర్ తియ్ అంటాడు. అంజలి డోర్ తీసి రోహిత్ నువ్వా, తాగావా అని అడుగుతుంది. నువ్వు ఇప్పుడు నాతో పాటు బయటకు రావాలని రోహిత్ అడుగుతాడు. ఏదో ప్రాబ్లెమ్ అనుకుని అంజలి బయటకు వస్తుంది. తీరా చూస్తే అక్కడ రాకీ ఉంటాడు. బావ నువ్వు చెప్పినట్లు చేశాను ఇంకేంటని రాకీ అంటాడు. రోహిత్ మత్తులో పడిపోతాడు. ఆ సమయంలో అంజలితో రాకీ తప్పుగా ప్రవర్తిస్తాడు. రోహిత్ రోడ్డుకి అడ్డంగా పడిపోతాడు. అప్పుడే గీత కార్ అక్కడికి వస్తుంది.. రోడ్డుపై పడి ఉన్న రోహిత్ ని చూసి గీత షాక్ అవుతుంది.

గీతను చూసి అమ్మగారు అని అంజలి పిలవబోతుంటే రాకీ వెంటనే తన నోరు మూస్తాడు. నువ్వు ఇప్పుడు అత్తయ్యని పిలిస్తే నీకు నాకు లింక్ ఉందని చెప్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో అంజలి సైలెంట్ అయిపోతుంది. రోహిత్ ని గీత ఇంటికి తీసుకెళ్తుంది. ఇంట్లో అందరు రోహిత్ తాగాడని చూసి షాక్ అవుతారు. నా తమ్ముడు ఇలా అవడానికి కారణం ఆ రాకీ, వాడి సంగతి చెప్పాలి.. ఇప్పుడే మనీష్ బావకి చెప్పాలని అంజలి అనుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఎదురుగా రాకీ వస్తాడు.

రాకీ మళ్లీ అంజలిని బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అంజలి భయపడుతుంది. ఇంట్లో నానమ్మ పరిస్థితి.. రోహిత్ తాగి రావడం.. భవిత నాటకాలు అన్నీ కలిసి ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. రాకీ కుట్రలో అంజలి ఇరుక్కుందని తెలిస్తే గీత ఎలా రియాక్ట్ అవుతుంది.. మనీష్ నిజం తెలుసుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com