
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -08 లో..... జానకమ్మ అన్న మాటలు గుర్తుచేసుకొని పెద్దాయన టెన్షన్ పడుతాడు. తన కొడుకు శివశంకర్ నిజంగానే పాపని ఆశ్రమంలో వదిలేసాడా.. జానకమ్మ మాటలు ఎంత వరకు నిజమని ఆలోచిస్తాడు. అంతలో గతంలో శివ శంకర్ జానకమ్మ పేరు మీద ప్రతీనెల అనాధ ఆశ్రమానికి డబ్బు పంపించడం దానికి సంబంధించిన ఫైల్ చూసి అప్పుడు పెద్దాయన జానకమ్మ చెప్పింది నిజమని కన్ఫమ్ చేసుకుంటాడు. మరొకవైపు గీతాంజలి దగ్గరికి మనీష్ వెళ్తాడు. అత్తయ్య నీకు ఇష్టమైన జున్ను తీసుకొని వచ్చానని చెప్తాడు. తన చేత్తో తినిపిస్తాడు.
నేను ఈ జున్ను తీసుకొని రావడం కోసం వెళ్ళాను అందుకే మీటింగ్ కి రాలేదు. ఇప్పుడు ఇది ఎందుకు తెచ్చానంటే ఆ వైజాగ్ ఇని స్టిట్యూట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అందరు ఆశ్రమం నుంచి వెళ్లిపోతున్నారని మనీష్ చెప్పగానే ఆ రోజు గొడవ పడ్డ అమ్మాయి అని గీతాంజలి అనగానే ఆ అమ్మాయి ఏదో అందరి కోసం అలా గొడవ పడిందని మనీష్ అంటాడు. మరొకవైపు జానకమ్మ అనాధాశ్రమం నుంచి అందరిని పంపిస్తుంది. నిన్న ఎక్కడికి వెళ్ళావ్.. నన్ను కూడా ఇక్కడ నుంచి పంపించడానికి వెళ్ళావా.. నా వాళ్ళని కలవడానికి వెళ్ళావా.. నేను ఎక్కడికి వెళ్ళనని గీతాంజలి ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు పెద్దాయన అదే ఆలోచిస్తుంటాడు. మనిష్ వస్తాడు. మీ తాతయ్య ప్రొద్దున నుంచి ఇలాగే ఉన్నాడని వాళ్ళ నానమ్మ చెప్తుంది. ఆ తర్వాత గీతాంజలి వాళ్ళు అందరు వస్తారు. మీరు అందరు బయటకి వెళ్ళండి. నేను మా నాన్నతో మాట్లాడాలని గీతాంజలి అంటుంది. నీ కూతురు అని పెద్దాయన ఏదో చెప్పబోయి బయట అందరిని చూసి ఆగిపోతాడు. తర్వాత నా కూతుళ్ల గురించి నేను చూసుకుంటానని గీతాంజలి అంటుంది. తరువాయి భాగంలో జానకమ్మ దగ్గరికి పెద్దాయన వస్తాడు. మనవరాలు కోసం వచ్చాడని జానకమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ తాతయ్య అని అంజలికి జానకమ్మ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





