
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-96 లో.. భానుని వాళ్ళ కొడుకు రోహిత్ పక్కకి తీసుకొని వస్తాడు. ఏంట్రా అని భాను అడుగగా ఆ విషయం గురించి అమ్మకు చెప్పొద్దని అని రోహిత్ అంటాడు. ఒక్కరు కూడా తప్పుడు దారిలో వెళ్ళకూడదని, తప్పు చేయకూడదని మీ అమ్మ అనుకుంటుంది.. అందుకే నేను చెప్పలేదని భాను అంటాడు. ఇక రాకీ చెప్పినట్టుగా సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తాడు రోహిత్. నేను కంబైన్డ్ స్టడీస్ కోసమే తనని తీసుకొచ్చానని, మీరనుకుంటున్నట్టుగా కాదని ఎమోషనల్ గా మాట్లాడతాడు. మీకు నా మీద నమ్మకం లేకపోతే బ్రతకడం వృధా అని రోహిత్ అనడంతో సరే ఇంకెప్పుడు అలా చేయకు అని భాను అంటాడు.
ఆ అంజలిని ఇంట్లో నుండి పంపించేద్దాం డాడి అంటు రోహిత్ అనగానే ఎందుకని భాను అడుగుతాడు. అంజలి వల్లే మన కాలేజీకి ప్రాబ్లమ్, అంజలి వల్లే భవిత దొంగతనం, అంజలి చెప్తేనే మీరు నన్న కొట్టారని రోహిత్ అన్నీ చెప్తాడు. అవన్నీ అంజలి వల్ల కాదు.. తన తప్పేం లేదని భాను అనగానే రోహిత్ సైలైంట్ అవుతాడు. ఆ తర్వాత గీత, భాను మాట్లాడుకుంటారు. కాసేపటికి గీత దగ్గరికి భవిత వస్తుంది. ఆ అంజలిని ఇంట్లో నుండి పంపిచేద్దామని భవిత అనగానే నెక్లెస్ దొంగతనం చేసింది నువ్వు, అంజలి తన మీద వేసుకొని శిక్ష అనుభవించింది.. సో పొరపాటున కూడా తనని ఇంట్లో నుండి పంపించకూడదని భవితకి స్ట్రాంగ్ గా చెప్తుంది గీత. అది కాదు అమ్మ.. తను అని ఏదో చెప్తూ ఆగిపోతుంది. మళ్ళీ నేను అంజలి, బావ దగ్గరవుతున్నారని చెప్తే నమ్మదేమోనని మనసులో అనుకొని నేను టిస్టబ్ అవుతున్నానని చెప్తుంది. దాంతో తన గురించి పట్టించుకోవద్దని భవితతో గీత చెప్తుంది.
మరోవైపు గవ్వలు ఆడుతుంది అంజలి. అదే సమయంలో ముసలమ్మ వస్తుంది. ఏం చేస్తున్నావని ఆమె అడుగగా నేను అనుకున్నది నెరవేరాలని గవ్వలు వేస్తున్నానని అంజలి అంటుంది. ఎన్నిసార్లు వేసినా పడదు. అప్పుడే మనీష్ అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నారని అడుగగా అమ్మమ్మ ఒకటి అనుకుంది అది నెరవేరాలని గవ్వలు వేస్తుంటే పడటం లేదని అంజలి అనగా నేనున్నానుగా అంటూ మనీష్ అంటాడు. మనీష్ మూడుసార్లు వేయగా మూడో సారికి అన్ని ఒకే షేప్ లో పడతాయి. దాంతో అంజలి వాళ్ళ అమ్మమ్మ అంజలి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ ఏంటి ప్లాన్ చేశారు కొత్తగా అని మనీష్ అనగా ఏం లేదని అంజలి అంటుంది. దాంతో అంజలి వెంట మనీష్ పడతాడు. అదంతా భవిత, రోహిత్ చూస్తుంటారు. మరుసటిరోజు ఫస్ట్ కావడంతో భవిత, రోహిత్ పాకెట్ మనీ కోసం గీత దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
