Home

»

Tv News

Ye Devi Varamo Neevu: అంజలిని కొట్టిన రోహిత్.. ముత్యాలరావ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా!

Oct 20, 2026 12:40PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-94లో.. రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొని వస్తాడు, తన గదిలో ఇద్దరూ ఉంటారు. అప్పుడే బాను వచ్చి ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను మా ఫ్రెండ్ అని రోహిత్ చెప్తుంటే బాను కోపంతో తన చెంప చెల్లుమనిపిస్తాడు. మీ అమ్మ మిమ్మల్ని ఎంత నమ్ముతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని కోప్పడతాడు.

కచ్చితంగా డాడ్ కి ఆ అమ్మాయి వచ్చిన విషయం అంజలి చెప్పిందని అనుకొని రోహిత్ అంజలి దగ్గరకు వెళ్తాడు. నువ్వు రాఖీ కట్టినంత మాత్రాన నువ్వు నా అక్కవు అయిపోవు, మా డాడ్ కి ఎందుకు ఆ విషయం చెప్పావని అంజలిని రోహిత్ కొడతాడు. అలా కొట్టడం రత్నం చూస్తుంది. ఏమైందని రోహిత్ ని అడిగినా వినిపించుకోకుండా వెళ్తాడు. ఏం లేదు అమ్మమ్మ, తను కాలేజీకి వెళ్లలేదన్న విషయం చెప్పానని కొట్టాడని అంజలి కవర్ చేస్తుంది. మరోవైపు రోహిత్ దగ్గరకు రత్నం వెళ్లి ఎందుకు అంజలిని కొట్టావని కోప్పడుతుంది. అప్పుడే నేను గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చిన విషయం అమ్మమ్మకి తెలియదన్న మాట అని రోహిత్ మనసులో అనుకుంటాడు.

మరోవైపు గీత కోసం ముత్యాలరావ్ వెతుకుతాడు. చివరికి తన కాలేజీ అడ్రస్ కనుక్కొని వెళ్తాడు. అక్కడ సెక్యూరిటీ ఆపినా మస్కా కొట్టి లోపలికి వెళ్తాడు. గీత రావడం చూసి ముత్యాలరావ్ ఒక పేపర్ పై 'నీ మొదటి కూతురు బ్రతికే ఉంది' అని రాసి కార్ ముందు పెడతాడు. గీత కార్ లో కూర్చొని ఉంటుంది, అప్పుడే వర్షం వస్తుంది. స్టూడెంట్ కంప్లైంట్ పేపర్ అనుకొని గీత ఆ పేపర్ ని తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Ye Devi Varamo Neevu Today Episode 94, Ye Devi Varamo Neevu Serial Star Maa, Rohit Girlfriend Bhanu Slap, Anjali Beaten By Rohit, Mutyala Rao Geetha Letter Twist]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com