Home

»

Tv News

Ye Devi Varamo Neevu : ముత్యాలరావ్ మాస్టర్ ప్లాన్.. గదిలో‌ గర్ల్ ఫ్రెండ్‌తో రోహిత్!

Oct 18, 2026 9:46AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -93 లో...... గీత నీకు పెళ్లి ముందు ఏదైనా గతం తాలూకా తప్పు ఉందా.. ఎప్పుడు తప్పు అనే పదం వినిపించినా నువ్వు తట్టుకోలేవని భాను అడుగుతాడు. అదేం లేదండి ఎవరు తప్పు చెయ్యకూడదని నేను అనుకుంటానని గీత కవర్ చేస్తుంది. అదంతా అంజలి వింటుంది. రత్నం దగ్గరకు వచ్చి పాపం అమ్మకి గతం గుర్తు వచ్చినట్లు ఉంది అమ్మమ్మ.. మా అమ్మ బాధపడుతుందని అంజలి చెప్తుంది. ఆ విషయం తన భర్తకు తెలిస్తే ఆయన క్షమించడు అని రత్నం అంటుంది.

ఈ విషయం జానకమ్మ , నీకు, తాతయ్య, నాకు తప్ప ఇంకెవరికి అయినా తెలుసా అని అంజలి అడుగుతుంది. ఎవరికి తెలియదు అని రత్నం చెప్తుంది. ఎవరికి తెలియొద్దు.. అమ్మ బాధపడే సిచువేషన్ రానివ్వను.. రావొద్దని అంజలి అంటుంది. మరొకవైపు గీత ఫొటోస్ చూస్తూ ముత్యాలరావు ఇంత సెలబ్రిటీని పక్కన పెట్టి అంజలిని వెతికితే ఏం వస్తుంది.. నీ కూతురు బతికే ఉందని ఆ గీతని బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బు వస్తుంది కదా అని ప్లాన్ చేస్తాడు. మరొకవైపు భవిత తన ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. వాళ్ళ అమ్మకు అబద్ధం చెప్పి స్కూటీపై వెళ్లాలని అనుకుంటుంది. అది అంజలి విని స్కూటీకి పంచర్ చేస్తుంది. భవిత ఇప్పుడు ఎలా వెళ్లాలి అని టెన్షన్ పడుతుంది. అక్కడ మొక్కలకు నీళ్లు పోస్తున్న అంజలిని చూసి నువ్వేనా పంచర్ చేసిందని అడుగుతుంది.. నేను కాదని తను కవర్ చేస్తుంది.

మరొకవైపు రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ తో కాఫీ షాప్ కి వస్తాడు. అది రాకీ చూసి ఈ బామ్మర్ది మన ట్రైనింగ్ లో చాలా ఫాస్ట్ అయ్యాడనుకుంటాడు. రాకీని రోహిత్ చూసి దగ్గరకు వచ్చి బావ ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు అంటాడు. ఆ తర్వాత రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని ఇంటికి వస్తాడు. నేను ముందు లోపలికి వెళ్తాను.. ఎవరు లేకుంటే పిలుస్తాను రమ్మని తనకి చెప్తాడు. రోహిత్ వెళ్లి ఆ అమ్మాయిని పిలుస్తాడు. అది అంజలి చూసి అమ్మాయి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని రోహిత్ కోప్పడతాడు. తరువాయి భాగంలో రోహిత్ గదిలో తన గర్ల్ ఫ్రెండ్ తో ఉంటారు. అప్పుడే భాను వచ్చి చూస్తాడు. ఆ అంజలి చెప్పి ఉంటుందని రోహిత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Ye Devi Varamo Neevu Today Episode 93, Geetha Past Secret Bhanu, Anjali Scooty Puncture, Rohith Girlfriend Entry]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com