
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' .ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -90లో హై డ్రామా నడిచింది. అంజలిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గీత చెప్పడంతో అంజలి ఏడుస్తూ వెళ్లిపోతుంటే మనీష్ అడ్డుకొని అసలు నిజం చెప్తాడు. నెక్లెస్ దొంగతనం చేసింది భవితే అని మనీష్ చెప్పడంతో అందరు షాక్ అవుతారు. తన ఫోన్ లో భవిత అంజలి రూమ్ కి వెళ్తున్న వీడియోను మనీష్ చూపిస్తాడు. దీంతో అంజలి నిర్దోషి అని తేలుతుంది. గీత కోపంగా భవితను కొడుతుంది. మిమ్మల్ని ఇలాగేనా పెంచిందని కోప్పడుతుంది. మీరు ఇలా చేస్తారనే అంజలి నింద తనపై వేసుకుందని మనీష్ చెప్తాడు. ఆగండి అంటూ అంజలి కూడా భవితకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.
అసలు నిజం చెప్పమని నిలదీయడంతో భవిత తన తప్పు ఒప్పుకుంటుంది. మమ్మీ ఆ నెక్లెస్ దొంగతనం చేసి ఆ నింద అంజలిపై వేసి తనని ఇంట్లో నుంచి పంపించాలనుకున్నానని చెప్తుంది. అదంతా నీపై ఉన్న ప్రేమతోనే చేశానని, నిన్ను ఇన్ స్టిట్యూట్ పెట్టకుండా అడ్డుకుని నిన్ను బాధపెట్టింది అంజలి అందుకే తన ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఇలా చేశానని భవిత ఏడుస్తూ చెప్తుంది. ఏది ఏమైనా నువ్వు ఇలా చేయడం తప్పు.. ఒక ఆడపిల్లపై దొంగ అనే నింద వేయడం ఏంటని గీత కోప్పడుతుంది. అంజలి ఈ తప్పు చేయలేదని తెలిసింది కదా.. ఇక అంజలిని ఇంట్లోకి రానివ్వమని రత్నం చెప్పగానే గీత సైలెంట్ గా వెళ్తుంది. దీంతో గీత ఒప్పుకున్నట్లేనని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంజలి చాలా హ్యాపీగా అవుట్ హౌస్ కి వెళ్లి తన బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వస్తుంది.
మరోవైపు రోహిత్ భవితను రాకీ కూర్చోబెట్టుకొని అంజలిపై రెచ్చగొడతాడు. ఇప్పుడు రోహిత్ ని అత్తయ్య కొట్టడానికి కారణం తనే, నన్ను మా అన్నయ్య కొట్టడానికి కారణం తనే, ఈరోజు భవితను కొట్టడానికి కారణం తనేనని చెప్తాడు. అసలు తను మన ఇంటికి పగ తీర్చుకోవడానికి వచ్చిందని రాకిని రెచ్చగొడతాడు. దీంతో రాకీ మనసులో మళ్లీ అంజలిపై కోపం పెంచుకుంటాడు. మరోవైపు మనీష్ పాట పాడుతుంటే అంజలి వచ్చి కలుస్తుంది. ఇద్దరూ కలిసి పాడుతూ డాన్స్ చేస్తారు. అంజలి నిర్దోషిగా బయటపడటంతో ఇంట్లో కొంత సంతోషం వచ్చినా రోహిత్ కుట్రతో మళ్లీ గొడవలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
