Home

»

Tv News

Ye Devi Varamo Neevu : అంజలి గురించి మనీష్ కి నిజం తెలుస్తుందా.. భవితే అసలు దొంగ!

Oct 13, 2026 11:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -88 లో గీతకి అంజలి సేవ చేస్తుంటే భాను వస్తాడు. గీతపై అంజలి అంత ప్రేమ చూపిస్తుంటే బాను ఆశ్చర్యంగా చూస్తాడు. సర్ అమ్మగారికి ఏం కాదని అంజలి అంటుంటే అంతా మనీష్ చెప్పాడని భాను అంటాడు. నేను అమ్మగారిని ఆ పరిస్థితిలో చూసి ఉండలేకపోయా అందుకే అమ్మగారు వద్దన్నా నేను ఇంట్లోకి వచ్చానని అంజలి చెప్పగానే ఏం పర్లేదమ్మా ఒక కూతురుగా ప్రేమగా చేసుకున్నావ్ దానికి ఎవరు తప్పుపడతారని భాను అంటాడు. 

నువ్వు టైర్డ్ అయ్యావ్ నేను చూసుకుంటా నువ్వు వెళ్లి పడుకోమని భాను చెప్తాడు.

ఆ తర్వాత రత్నం దగ్గరకు మనీష్ వస్తాడు. నానమ్మ అంజలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.. ఎందుకు తనకి అత్తయ్య అంటే అంత ఇష్టం.. నాకే జెలస్ గా ఉంటుంది అంత ప్రేమ చూపిస్తుంది. తనకి మన ఇంటికి ఏమైనా సంబంధం ఉందా.. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతాడు. అదేం లేదురా అని రత్నం టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఏ జన్మలోనో అంజలికి గీతకి బంధం ఉన్నట్లు ఉందని రత్నం చెప్తుంది. ఆ తర్వాత అంజలి దగ్గరకు మనీష్ కాఫీ తీసుకొని వస్తాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు.

మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. భవిత వచ్చి ఏంటి ఇంకా అంజలిని పంపించలేదా అని అడుగుతుంది. ఎందుకు ఆ రోజు ఆపావు.. ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావని మనీష్ అడుగుతాడు. అంటే ఆ రోజు టైం ఇచ్చావ్ కదా ఆ టైమ్ పూర్తయిందని భవిత అంటుంది. తరువాయి భాగంలో భవిత దొంగతనం చేసిందని మనీష్ ఇంట్లో వాళ్లకి చెప్పి అంజలి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com