
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -86 లో రత్నం దగ్గరకు గీత టిఫిన్ తీసుకొని వస్తుంది. నువ్వు ఎందుకు ఇవన్నీ చెయ్యడం అని రత్నం అనగానే మా అమ్మ కోసం ఆ మాత్రం చెయ్యలేనా అని గీత అంటుంది. ఎందుకే ఆ అంజలి మీద అంత పంతం, నా కోసం పనులు మానుకొని నువ్వు ఇంట్లో ఉండడం ఎందుకని రత్నం అడుగుతుంది. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకమ్మా, ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకుంటూనే మీటింగ్ అటెండ్ అవుతానని గీత చెప్తుంది.
దీంతో రత్నం గీత మాటలకు కాస్త ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత రత్నం దగ్గరకు మనీష్ వచ్చి నానమ్మ నిన్ను అంజలి బాగా చూసుకుంటుందా.. అత్తయ్య బాగా చూసుకుంటుందా అని అడుగుతాడు. నాకు ఇద్దరు రెండు కళ్లతో సమానం, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదని రత్నం అంటుంది. మాటల మధ్యలో ఎంతైనా సొంత మనవరాలు అని రత్నం అనగానే ఏంటి సొంత మనవరాలు అని మనీష్ షాక్ అవుతాడు. దీంతో రత్నం వెంటనే కవర్ చేస్తుంది.
మరోవైపు గీత దగ్గరకు మీటింగ్ కి ఇద్దరు వస్తారు. అంజలిని చూసి ఎవరో అమ్మాయి అచ్చం గీత మేడం లాగే ఉందని వాళ్లు అంటుంటారు. పనిమనిషి నాలాగా ఉండడం ఏంటని గీత కోప్పడుతుంది. తనే స్వయంగా వాళ్లకి కాఫీ తీసుకొని వస్తుంది.
రత్నం కోసం జ్యూస్ చేసి తీసుకొని వెళ్తుంది గీత. ఇలా ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటుంది. మీటింగ్ వాళ్లు వెళ్లిపోయాక ఒక్కసారిగా గీత కళ్లు తిరిగి కిందపడిపోతుంది. అది చూసిన అంజలి భయంతో ఏడుస్తుంది. గీతకు ఏమైంది, అంజలి గీతను కాపాడుతుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
