Home

»

Tv News

తప్పించుకున్న రాకీ.. అంజలికి మూడు రోజులే గడువు!

Oct 9, 2026 10:49AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-85లో రాకీ వల్లే రోహిత్ చెడిపోతున్నాడని అంజలి చెప్పగానే రాకీని మనీష్ బెల్ట్ తో కొడతాడు. ఆగు అన్నయ్య, ఆ పనిమనిషి చెప్పింది నమ్ముతావా అని రాకీ అంటాడు. నేను, రోహిత్ బయటకు పార్టీకి వెళ్లాము.. అక్కడ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో మందు కలిపారు..‌ఆ విషయం తెలియక రోహిత్ తాగాడని రాకీ కథ అల్లుతాడు. దాంతో అందరు అదే నిజం అనుకొని నమ్ముతారు.

ఒక మనిషి చెప్తే కొట్టావ్ అన్నయ్య, కానీ నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా, ఇప్పుడు అలాంటి నింద వేసింది.. రేపు తన చెయ్యి పట్టుకున్నాడని కూడా చెప్తే నమ్మేస్తారా అని రాకీ అనగానే ఒరేయ్ అంజలి అలా ఎందుకు చెప్తుందిరా అని రత్నం అంటుంది. ఈ ఇంట్లోకి రావాలని ప్రయత్నం అని రాకీ అంటాడు. దాంతో గీత కోపంగా నా అల్లుడు మీద నింద వేస్తావా.. ఏదో ఆడపిల్లలా ఉంటుందని పంపలేదు కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్లడానికి ఇంకా మూడు రోజులు గడువు ఉందని గీత చెప్పగానే అంజలి ఏడుస్తూ బయటకు వస్తుంది.

ఆ తర్వాత భవిత, రోహిత్ ని రత్నం పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నారు.. గీత మిమ్మల్ని ఎంత పద్ధతిగా పెంచిందని అంటుంది. రోహిత్ తప్పు లేదని తెలిసింది కదా అని భవిత అంటుంది.. ఎవడో తప్పు చెయ్యడానికి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని రత్నం అంజలిని చూడండి అని అంజలి గురించి గొప్పగా చెప్తుంటే భవితకి కోపం వస్తుంది.

ఆ తర్వాత ఏంటి బావ ఇదంతా అని రాకీని రోహిత్ అడుగుతాడు. నిన్ను సేవ్ చేశాను రా, నువ్వు తాగడానికి రూట్ స్మూత్ చేశానని రాకీ అంటాడు. కానీ ఆ అంజలికి నువ్వు నేను అంటే కోపం, మనల్ని తిడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని అంజలి గురించి నెగెటివ్ గా రోహిత్ కి చెప్తాడు. మరోవైపు రోహిత్ ని రాకీ ఇంకా చెడగొడతాడని అంజలి భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com