.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఏ దేవి వరమో నీవు' . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-82 లో.. భవిత నెక్లెస్ దొంగతనం చేసిందని మనీష్ కి తెలిసి ఇంట్లో చెప్పాలని వెళ్తుంటే అంజలి ఆపుతుంది. ఆ విషయం అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదని అంజలి అంటుంది. దీనికి మనీష్ నువ్వు చాలా గ్రేట్ అంజలి అంటాడు. భవిత సొంత కూతురై ఉండి కూడా అలా ఆలోచించలేదు.. నువ్వు బాగా ఆలోచించావ్.. నిన్ను కన్నతల్లి ఎవరో కానీ గ్రేట్ అని మనీష్ అంజలిని పొగుడుతాడు. మరోవైపు రాజారావు ఇంటికి ముత్యాలరాజు వెళ్లి అతను లేకపోవడంతో డిస్సపాయింట్ గా డ్రింక్ చేయడానికి వెళ్తాడు.
అక్కడ వేరొక అతన్ని మస్కా కొట్టి మందు తెప్పించే సమయంలో ఒక పాంప్లెట్ పై శాఖమూరి రాజారావు శ్రద్ధాంజలి అని చూసి ముత్యాలరాజు షాక్ అవుతాడు. ఒరేయ్ రాజారావు నువ్వు చనిపోతే నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి.. ఎవరు డబ్బు ఇస్తారని బాధపడతాడు. మరోవైపు ఇంట్లో రత్నంకి ఆయాసం వచ్చి వాటర్ తీసుకోబోతుంటే తను కింద పడిపోతుంది. అప్పుడే అంజలి తనని చూడడానికి కిటికీ దగ్గరకు వస్తుంది. అలా పడిపోయి ఉండడం చూసి అంజలి అందరిని పిలుస్తుంది. అందరు రావడంతో నన్ను అంజలి మాత్రమే బాగా చూసుకుంటుంది.. ఇప్పుడు అంజలి వల్లే మీకు తెలిసిందని రత్నం బాధపడుతుంది. దీంతో ఇంట్లో గొడవ మొదలవుతుంది.
రత్నం మాటలకు గీత కోపంగా అంజలి దగ్గరకు వచ్చి ఏంటి..నీ కంటే మా అమ్మని ఎవరు బాగా చూసుకోలేరా అని నిలదీస్తుంది. నేను చూసుకుంటాను.. నువ్వు అవుట్ హౌస్ లో ఉన్నా మా అమ్మకి దగ్గరగా ఉన్నావ్.. మా అమ్మని అంత మార్చేశావని అంటుంది. నువ్వు వారం రోజుల్లో పని చూసుకుని వెళ్లిపోమని గీత కోప్పడుతుంది. తరువాయి భాగంలో రోహిత్ డ్రింక్ చేశాడని గీత కొడుతుంది. దీంతో అంజలి ఆపండి అమ్మగారు.. అతను డ్రింక్ చేయడానికి కారణం రాకీ బాబు అని చెప్పగానే బెల్ట్ తో రాకీని మనీష్ కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:




.webp)
.webp)
