Home

»

Tv News

Ye Devi Varamo Neevu: పనిమనిషిని ఇరికించిన అంజలి.. గీత కండిషన్స్‌కి చెక్!

Oct 2, 2026 11:07AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-79లో..  మనీష్ కొత్త పనిమనిషిని తీసుకొని వస్తాడు. ఆమె టీ చేసి అందరికి ఇస్తుంది. టీ బాగుందని అందరు మెచ్చుకుంటారు. అయితే గీత మాత్రం ఆ పని మనిషికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది. నువ్వు వంట మనిషివి కాబట్టి కేవలం వంట గురించి మాత్రమే పట్టించుకోవాలి.. ఇంట్లో విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.. కిచెన్ లో వంట శబ్దం వినిపించకూడదు.. ఫోన్ చూస్తూ వంట చేయకూడదని కండిషన్స్ పెడుతుంది. దానికి ఆ పని మనిషి సరే అంటుంది.

ఆ పని మనిషి కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ.. ఈ ఓనర్ కి బాగా ప్రౌడ్ ఉంది, అన్ని కండిషన్స్ పెడుతుందని చెప్తుంది. అదంతా అంజలి కిటికీలో నుండి వింటుంది. మా అమ్మని అలా అంటావా అని అనుకుంటుంది. వెంటనే మనీష్ ని పిలిచి.. అమ్మగారి గురించి అలా మాట్లాడుతుంది, వెంటనే పనిలో నుండి తీసేయ్ అని అంజలి చెప్తుంది. దానికి మనీష్ "ఏ కారణం చెప్తావ్? అత్తయ్యని తిట్టింది అనడానికి సాక్ష్యం ఉందా? నువ్వు చెప్తే తను నమ్ముతుందా అని అంటాడు. దీంతో అంజలి వేరే ప్లాన్ వేస్తుంది.

పని మనిషి వంట చేస్తుండగా కిటికీలో నుండి ఆమె చేసిన వంటల్లో ఉప్పు, కారం కలిపేస్తుంది అంజలి. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తూ ఆ వంటలు చూసి షాక్ అవుతారు. ఇలాగేనా చేసేదని గీత కోప్పడుతుంది. మనీష్ తనకి డబ్బు ఇచ్చేసి పంపించేయ్ అని గీత అనగానే దూరం నుంచి అంజలి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. పక్కకు వెళ్లి డాన్స్ చేస్తుండగా అప్పుడే మనీష్ వస్తాడు.

తరువాయి భాగంలో అంజలి ఉప్మా చేస్తుండగా ఆ వాసనకు భాను, మనీష్, ప్రీతి వస్తారు. "కొంచెం వేయ్" అని అడుగుతారు. అది గీత చూసి.. ఈ వంకతో ఇంట్లోకి రావాలని ట్రై చేస్తున్నావా అని కోపడుతుంది. మరి గీత మాటలకు అంజలి ఏం సమాధానం చెప్తుంది? అంజలి మళ్లీ వంటమనిషిగా ఇంట్లోకి వస్తుందా లేదా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Ye Devi Varamo Neevu Today Episode 79, Ye Devi Varamo Neevu Serial, Anjali Plan Against Maid, Geetha Conditions]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com