
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 78 ఉత్కంఠగా సాగింది. అంజలి డల్ గా కూర్చుని ఉండగా గీత బయటకు వెళ్తూ వాటర్ వేస్ట్ అవ్వడం చూసి మోటార్ ఆఫ్ చేసి వెళ్తుంది. అయితే బ్యాగ్ మర్చిపోవడంతో అంజలి.. అమ్మగారు బ్యాగ్ అంటూ తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో గీత అంజలిపై అనుమానం పెంచుకుంటుంది. ఇలా వాటర్ వేస్ట్ అయ్యేలా చేసి బ్యాగ్ మర్చిపోతే తీసుకొచ్చి ఇవ్వడం నీ ప్లానా అంటూ తన బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది. దీంతో అంజలి తీవ్రంగా బాధపడుతుంది.
అసలు ఇంత పెద్ద దొంగతనం నిందను అంజలి ఎందుకు మీద వేసుకుందనేది సస్పెన్స్ గా మారింది. మా అమ్మతో గొడవ అయింది, అమ్మమ్మను చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది.. ఇవన్నీ నిందలు భరిస్తూ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది.. రీనా చెప్పినట్లు బావ కోసం ఇదంతా చేస్తుందా అని భవిత అనుకుంటుంది. మరోవైపు అంజలి మాత్రం.. నేను ఇదంతా చేస్తుంది అమ్మ కోసం.. భవిత దొంగతనం చేసిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు.. భవితను మంచి దారిలోకి తీసుకురావాలని మనసులో అనుకుంటుంది.
ఇంకోవైపు రాజారావును బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి బార్ కి వెళ్లి రాజారావు ఇచ్చిన డబ్బు అయిపోవడంతో మళ్లీ ఫోన్ చేస్తాడు. కానీ రాజారావుకి ఫోన్ కలవదు. ఫోన్ కలవకపోతే ఏంటి, ఇంటికే వెళ్తానని అతను అనుకుంటాడు. అంజలి మాత్రం.. నేను అవుట్ హౌస్ నుంచి ఇంట్లోకి వెళ్లాలంటే బావ తప్ప ఎవరూ హెల్ప్ చేయరని ఆలోచిస్తుంది.
అదే సమయంలో మనీష్ ఒక కొత్త పనిమనిషిని ఇంట్లోకి తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొచ్చావ్.. నేను ఉన్నాను కదా అని అంజలి గొడవ పెట్టుకుంటుంది. నా చేతిలో ఏం లేదు, అంతా అత్తయ్య ఇష్టమని మనీష్ అంటాడు. ఆ కొత్త పనిమనిషి కాఫీ తీసుకొచ్చి గీత వాళ్లకి ఇస్తే వాళ్లు బాగుందని మెచ్చుకుంటారు. దీంతో అంజలికి కోపం మరింత పెరుగుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.. నేను పనిమనిషిగా ఉండాలి.. తనని పంపించేయ్ అని మనీష్ కి తెగేసి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

