Home

»

Tv News

Ye Devi Varamo Neevu: మనీష్ అసలు దింగ ఎవరో కనిపెడతాడా.. అంజలిని మళ్లీ అనుమానించిన గీత!

Sep 30, 2026 10:07AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఏ దేవి వరమో నీవు సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 77లో..  అంజలి పొద్దున్నే లేచి పూజ చేస్తూ కనిపించింది. అది చూసి రత్నం ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చి.. ఏంటే నిన్న ఏడుస్తున్నావ్, ఈ రోజు ఏంటి ఇలా ఉన్నావని అడుగుతుంది. దీనికి అంజలి.. నువ్వు చెప్పాక అర్థమైంది అమ్మమ్మ, నేను వచ్చిన పనేంటో. అమ్మ నన్ను కంటపడొద్దు అంది కానీ నేను తనని చూడొద్దు అనలేదు కదా, దూరం నుంచి అయినా అమ్మని చూసుకుంటున్నానని చెప్తుంది. అంజలి మాటలకు రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది.

 

మరోవైపు భవిత వాళ్ల దగ్గరికి మనీష్ వెళ్లి.. అసలు నువ్వు నెక్లెస్ ఎక్కడ పెట్టావ్, అంజలి నీ రూమ్ కి ఎప్పుడు వచ్చిందని ఆరా తీస్తాడు. నేను లాకర్ లో పెట్టాను బావ అని భవిత టెన్షన్ పడుతుంది. నీకు ఏ చిన్న క్లూ దొరికినా నాకు చెప్పు, అంజలి ఈ దొంగతనం చేయలేదని నిరూపించాలని మనీష్ అనగానే అమ్మో నేను దొరికిపోతానేమోనని భవిత భయపడుతుంది. ఆ తర్వాత రాకీ తన చెంపకు చేయి అడ్డుపెట్టుకుని అంజలి కొట్టింది గుర్తుచేసుకుంటాడు. మెల్లగా ఈ రోహిత్ గాడిని నా వైపుకు మార్చుకోవాలి.. అప్పుడే నేను చెప్పింది వింటాడు. అత్తయ్య వీడి మాటలు నమ్ముతుందని రాకీ ప్లాన్ వేస్తాడు.

 

మనీష్ వచ్చి రోహిత్ తో మాట్లాడతాడు. నువ్వు అంజలి దొంగతనం చేసిందని నమ్ముతున్నావా అని అడిగితే అమ్మ నమ్ముతుంది కదా బావ అని రోహిత్ అంటాడు. ఇంట్లో వాళ్లు ఎవరో దొంగతనం చేసి వాళ్లని కాపాడటానికి అంజలి ఇలా చేసిందని మనీష్ అనగానే అవును బావ అని రోహిత్ ఒప్పుకుంటాడు. ఏదైనా క్లూ దొరికితే చెప్పమని మనీష్ వెళ్తాడు. ఆ తర్వాత రాకీ వస్తాడు. బావ నీకు మనీష్ బావకి ఎంత తేడా ఉంది బావ.. అంజలిని కాపాడాలి అనుకుంటున్నాడు.. నువ్వు కాటేయాలి అనుకుంటున్నావని రోహిత్ అనడంతో రాకీ షాక్ అవుతాడు.

 

 మరోవైపు అంజలి బయట కూర్చుని ఉంటుంది. అప్పుడే గీత బయటకు వెళ్తుంది. తరువాయి భాగంలో వాటర్ వేస్ట్ అవుతున్నాయని గీత తన బ్యాగ్ పక్కన పెట్టి వాటర్ ఆఫ్ చేసి వెళ్తుంది. బ్యాగ్ మర్చిపోయి వెళ్తుంది. అంజలి ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఏంటి ఇదంతా నీ ప్లానేనా, వాటర్ పోయేలా చేయడమని గీత అనుమానంగా తన బ్యాగ్ లో డబ్బు ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అది చూసి అంజలి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com