Home

»

Tv News

Ye Devi Varamo Neevu: అసలు దొంగ ఎవరు.. స్టోర్ రూమ్ లో అంజలి కన్నీరు!

Sep 29, 2026 9:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఏ దేవి వరమో నీవు సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్   76లో.. గీత అంజలిని దొంగతనం నిందతో స్టోర్ రూంలోకి పంపిస్తుంది. అసలు ఎందుకు ఈ దొంగతనం నీ మీద వేసుకున్నావని రత్నం అంజలిని నిలదీస్తుంది. అయినా అంజలి సైలెంట్ గా ఉంటూ ఏమీ చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంటుంది. తాను చేయని తప్పును ఎవరినో కాపాడటం కోసం తన మీద వేసుకుందని అందరికి అర్థమవుతున్నా, అంజలి మాత్రం నోరు విప్పదు.

 

మరోవైపు అంజలి ఏడుస్తూ కూర్చుంటే మనీష్ భోజనం తీసుకొని వెళ్లి ఇస్తాడు. నాకు ఆకలిగా లేదని అంజలి అంటే, నాకు ఆకలిగా ఉందని మనీష్ అంటాడు. నువ్వు తినలేదా అని అంజలి అడగ్గా, లేదు నువ్వు ఇలా బాధపడుతుంటే నేనెలా తింటానని మనీష్ అనగానే ఇద్దరూ ఒకే ప్లేట్ కి చెరోవైపు కూర్చుని భోజనం చేస్తారు. "నువ్వు దొంగతనం చేయలేదని తెలుసు, కానీ నువ్వు ఎవరినో కాపాడటానికి ఇలా చేస్తున్నావని అర్థం కావడం లేదు" అని మనీష్ అంటాడు. ప్లీజ్ అవన్నీ ఏం అడగకు అని అంజలి అంటే, "నువ్వు చెప్పకున్నా సరే ఇంటి దొంగని నేను కనిపెడతాను" అని మనీష్ ధైర్యం చెప్తాడు.

 

ఇంట్లో మరోవైపు రత్నం దగ్గరికి గీత భోజనం తీసుకెళ్తుంది. నాకు ఆకలిగా లేదని రత్నం అంటుంది. అయినా భోజనం పక్కన పెట్టి గీత వెళ్లిపోతుంది. అదే సమయంలో అంజలి దగ్గరికి రాకీ వెళ్లి తప్పుగా ప్రవర్తిస్తాడు. దీంతో అంజలి కోపంతో అతని చెంపచెల్లుమనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి రా ఇలా ప్రవర్తించకు అని, ఇంకోసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో రాకి అక్కడి నుంచి వెళ్లిపోయి.. చావు దెబ్బ కొట్టావ్ కదే అంటూ కోపంతో రగిలిపోతాడు.

 

చివర్లో రత్నం దగ్గరికి గీత మళ్లీ వస్తుంది. భోజనం తినకుండానే పడుకుందని చూస్తుంది. అప్పుడే బాను వచ్చి.. తనకి అంజలి అంటే ఎంత ఇష్టమో అర్థమైందా అని అంటాడు. దానికి గీత.. అది దొంగ ప్రేమ, ముందు మా నాన్నని మాయ చేసింది, ఇప్పుడు అమ్మని మాయలో పడేసిందంటూ కోపంగా అంటుంది. ఇంతకీ అంజలి ఎవరిని కాపాడటానికి దొంగతనం నిందను తనపై వేసుకుంది? ఇంట్లో అసలు దొంగ ఎవరనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Episode 76, Star Maa Serial, Anjali, Manish, Geetha, Ratnam, Rocky, Banu, Necklace Theft, House Thief]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com