Home

»

Tv News

Ye Devi Varamo Neevu: స్టోర్ రూమ్‌లో ఏడుస్తున్న అంజలి.. తనపై చేయి వేసింది ఎవరు?

Sep 27, 2026 11:17AM


 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'.‌ ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-75 లో.. అంజలి స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంటే రత్నం వెళ్లి కోప్పడుతుంది. ఈ త్యాగాలు ఎవరి కోసం, ఎవరిని కాపాడాలని, అసలు ఆ దొంగతనం నీ మీద ఎందుకు వేసుకున్నావని ఎంత అడిగినా అంజలి సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు అంజలిని గుర్తుచేసుకొని రేవతి బాధపడుతుంది. మా అక్క గురించి ఆ అమ్మాయి ఎందుకు తక్కువ చేసి మాట్లాడింది. మా అక్క ఆ ఇంటికి పనిమనిషా అని రేవతి బాధపడుతుంది.

ఆ తర్వాత అంజలి స్టోర్ రూమ్ కి వెళ్లిందని రాకీ చాలా హ్యాపీగా ఉంటాడు. నేనే దేవుడిని, నాకు నేనే వరాలు ఇచ్చుకుంటానని రోహిత్ తో అర్థం లేకుండా మాట్లాడుతాడు. మరోవైపు భవిత వాళ్లు అంజలి దొంగతనం చేసింది అంటూ మాట్లాడుతుంది. దొంగతనం చేస్తే మరి తనని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా అడ్డు పడ్డావని ప్రీతి అడుగుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఆలోచించి అలా చేశానని భవిత అంటుంది. అప్పుడే మనీష్ వచ్చి.. అంజలి గురించి మనకు తెలియదా.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కోప్పడతాడు. మరోవైపు అంజలి వంట చేయలేదు కాబట్టి గీత బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. రేపటిలోగా కొత్త పని మనిషి వస్తుందని చెప్తుంది. ఇంట్లో అంజలి లేకపోవడంతో పనులన్నీ ఆగిపోయినట్లు కనిపిస్తుంది. భవిత మాత్రం అంజలిని ఇంట్లో ఉంచడానికి ఏదో పెద్ద కారణమే ఉందని హింట్ ఇస్తుంది.

స్టోర్ రూమ్ లో ఉన్న అంజలి దగ్గరికి వెళ్లి ఒక వ్యక్తి తనపై చేయి వేస్తాడు. దాంతో అంజలి చెంప చెల్లుమనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు..‌అంజలిపై చేయి వేసింది రాకీనా లేక వేరేవాళ్లా, అంజలి తన మీద దొంగతనం నిందను ఎందుకు వేసుకుందనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




[Ye Devi Varamo Neevu Today Episode 75, Ye Devi Varamo Neevu Serial September 26, Anjali Store Room Episode, Star Maa Ye Devi Varamo Neevu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com