
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు శుక్రవారం నాటి ఎపిసోడ్ 74లో.. నేనే దొంగతనం చేశానని అంజలి చెప్పడంతో రత్నం కోప్పడుతుంది. నువ్వు అలా చేయవు.. ఎవరిని కాపాడాలని ఇదంతా చేస్తున్నావని నిలదీస్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని అంజలిపై గీత సీరియస్ అవుతుంది. ఎంత రిక్వెస్ట్ చేసినా గీత వినకపోవడంతో అంజలి ఏడుస్తూ బయటకు వెళ్తుండగా భవిత ఆపుతుంది.
అమ్మ ఇప్పటికిప్పుడు ఇలా వెళ్లిపోతే ఎలా.. ఆడపిల్ల కదా ఎలా ఉంటుంది.. నీ కూతురు లాంటిది క్షమించనని భవిత గీతను బతిమాలుతుంది. అవును చిన్నపిల్ల అయినా కరెక్ట్ చెప్పింది.. ఇప్పుడు తను వెళ్తే ఏమైనా అయితే ఆ పాపం మన పిల్లలకు తగులుతుందని బాను కూడా సపోర్ట్ చేస్తాడు. దీంతో సరే ఉండనివ్వండి అని గీత అనగానే అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు నిన్ను శాశ్వతంగా ఇక్కడ ఉండిపొమ్మనడం లేదు, ఏదైనా పని చూసుకుని వారం రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోమని గీత కండీషన్ పెడుతుంది.
ప్రస్తుతం నువ్వు ఇంట్లో వద్దు, అవుట్ హౌస్ లోకి వెళ్లమని గీత చెప్పడంతో అంజలి సరే అంటుంది. ఆ తర్వాత భవిత తనని ఎందుకు ఆపిందో అసలు విషయం బయటపడుతుంది. వీరిద్దరి మధ్య ముందే ఒప్పందం జరిగింది. భవితనే నెక్లెస్ దొంగతనం చేసి అది అంజలిపై వేసిందనే నిజం చెప్పబోతుంటే వద్దని అంజలి రిక్వెస్ట్ చేసింది. ఇంట్లో నుంచి నన్ను గెంటేస్తే నువ్వు ఆపాలి.. అలా ఆపకపోతే నేనే నిజం చెప్తానని అంజలి బ్లాక్ మెయిల్ చేయడంతో భవిత సరే అంటుంది.
ఆ తర్వాత అంజలి స్టోర్ రూమ్ కి వెళ్తుంది. తరువాయి భాగంలో అంజలి దగ్గరకు రత్నం వచ్చి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావ్..ఇప్పుడు నిజం తెలియాలంటూ నిలదీస్తుంది. అసలు దొంగతనం వెనుక భవిత ఉందన్న నిజం బయటకు వస్తుందా.. అంజలి అవుట్ హౌస్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Episode 74, Star Maa Serial, Anjali, Bhavitha, Geetha, Ratnam, Banu, Necklace Theft, Anjali Lie, Bhavitha Secret]





(1).webp)
