Home

»

Tv News

Ye Devi Varamo Neevu: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసిన మనీష్.. నెక్లెస్ మాయం, అంజలిపై అనుమానం!

Sep 20, 2026 11:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-69లో.. మనీష్ దగ్గరికి భవి వచ్చి.. వికారాబాద్ వాటర్ ఫాల్స్ కి వెళ్దామని అంటే వర్క్ ఉందని చెప్తాడు.  దాంతో భవి ఒక ప్లాన్ వేస్తుంది. గీత దగ్గరికి భవి వెళ్ళి.. మమ్మీ ఈ రోజు హాలిడే కదా.. అలా సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి వికారాబాద్ వాటర్ ఫాల్స్ కి వెళ్దామని అనుకున్నాం .. నాతో పాటు బావని తీసుకెళ్ళనా అని అడుగుతుంది. నువ్వే చెప్పమని భవి అంటుంది. దాంతో మనీష్ ని గీత పిలిచి .. భవిని తీసుకెళ్ళమని అంటుంది. సరేనని మనీష్ అంటాడు. ఇక మనీష్ కొత్త ప్లాన్ వేస్తాడు.

ఈరోజు అందరికి హాలిడేనే కదా అని మనీష్ రాకీ, రోహిత్ అందరిని పిలుస్తాడు. ఇక అందరు వచ్చాక వికారాబాద్ వాటర్ ఫాల్స్ కి వెళదాం.‌. ఫ్యామిలీ టూర్ అనగానే అందరు ఒప్పుకుంటారు. అయితే గీతని అడిగితే తనకి ఇంపార్టెంట్ మీటింగ్స్  ఉన్నాయని చెప్తుంది. ఇక అందరు రిక్వెస్ట్ చేయండతో ఈ రోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ .. అందరం ఫ్యామిలీ టూర్ వెళదామని అంటుంది. ఇక అందరిని రెడీ అవ్వమని పంపిస్తుంది. దూరం నుండి అంజలి చూస్తుంటుంది. అంజలిని గీత చూసి.. ఫ్యామిలీ అంటే తనకి అర్థం కాదా.. బొట్టుపెట్టి చెప్పాలా.. ఫ్యామిలీ అంటే అమ్మ వస్తుంది. అమ్మని చూసుకోవడానికి తను కూడా ఉండాలి కదా.. వెళ్ళి రెడీ అవ్వమని చెప్పమని గీత చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని అంజలి సంతోషంగా తన గదిలోకి వెళ్తుంది. అమ్మమ్మతో తనని ఫ్యామిలీ టూర్ కి రమ్మని అమ్మ చెప్పిందంటూ హ్యాపీగా చెప్తుంది. 

కాసేపటికి అందరు రెడీ అయి హాల్లోకి వస్తారు. అయితే భవి వాళ్ళు మాత్రం ఇంకా రెడీ అవుతారు. గీత పిలవగానే వస్తున్నామని చెప్తారు. సరిగ్గా అదే సమయంలో రాఖీ పండగ రోజు భవికి రోహిత్ ఇచ్చిన నెక్లెస్  పెట్టుకుందామని బీరువా ఓపెన్ చేసి చూస్తే అక్కడ నెక్లెస్ ఉండదు. దాంతో అంతా టెన్షన్ పడతారు. కాసేపటికి కిందకి వచ్చిన భవి.. నెక్లెస్ కనపడటం లేదని చెప్తుంది. అది విని అంతా షాక్ అవుతారు. ఇంట్లో పనిచేసేవాళ్ళని పిలిపించి అందరి దగ్గర వెతకమంటుంది. ఎవరి బ్యాగ్ లోను నెక్లెస్ కనపడదు. మరి ఎక్కడికి వెళ్ళిందని అందరు ఆలోచిస్తుంటే.. మరి అంజలి బ్యాగ్ వెతికారా అని రాకీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Ye Devi Varamo Neevu today episode 69, Star Maa Ye Devi Varamo Neevu September 20 episode, Ye Devi Varamo Neevu family tour Vikarabad plan, Ye Devi Varamo Neevu Bhavi necklace missing twist, Ye Devi Varamo Neevu Anjali bag check doubt]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com