.webp)
స్టార్ మా సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-101వ ఎపిసోడ్ లో అంజలికి బ్లడ్ అవసరం పడటంతో మనీష్ టెన్షన్ పడతాడు. భాను వచ్చి గీతది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని చెప్తాడు. దాంతో గీతకు మనీష్ ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. ముందు ఫోన్ పెట్టెయ్ అని గీత అంటుంది. అత్తయ్య ఈ పరిస్థితిలో కూడా అంజలిపై కోపం చూపిస్తుందని మనీష్ అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి.. బ్లడ్ దొరికిందా, పది నిమిషాల్లో బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణానికి ప్రమాదమని చెప్తుంది.
ఇదంతా నీ వల్లే అని రాకిపై రోహిత్ కోప్పడతాడు. ఏంటి బావమరిదీ నన్ను అంటున్నావ్, నేను ఏం చేశానని రాకీ అంటాడు. నువ్వే కదా మా డాడ్ కి నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన విషయం అంజలి చెప్పిందన్నావ్.. తనపై కోపం ఉందన్నావ్.. నీ కోపం తగ్గించడానికి ఇదంతా చేశానన్నావని రోహిత్ అంటాడు. ఇప్పుడు అంజలికి ఏమైనా అయితే మన పరిస్థితి ఏంటని రాకీ అనగానే ప్లీజ్ బావ అలా కాకుండా చూడమని రోహిత్ రిక్వెస్ట్ చేస్తాడు.
నేను ఎక్కడైనా బ్లడ్ గురించి చూస్తా అని మనీష్ వెళ్తుంటే అప్పుడే గీత వస్తుంది. బ్లడ్ ఇవ్వాలి అన్నారు కదా ఎక్కడ అని గీత అనగానే మనీష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అంజలికి గీత బ్లడ్ ఇస్తుంటే అటు పక్కనే కుక్క కరిచి ముత్యాల రావు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఏంటి అప్పటి నుంచి ఏదో హడావిడి అని నర్సుని అడుగుతాడు. ఒక పేషెంట్ కి బ్లడ్ అవసరం ఉంటే ఒక ఆవిడ ఇస్తుందని నర్సు చెప్తుంది. తరువాయి భాగంలో అంజలికి ఎందుకు అలా జరిగిందో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాకీ రూమ్ లో బ్లడ్ పడి ఉండటం చూసి పోలీసులు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
