.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-100 లో రాకీ ప్లాన్ ను రోహిత్ అమలుపరుస్తాడు. రోహిత్ కలిపిన జ్యూస్ తాగి అంజలికి మత్తుగా అనిపిస్తుంది. రోహిత్ డోర్ పెట్టి బయటకు వెళ్తుంటే.. తమ్ముడు ఎందుకు డోర్ పెడుతున్నావని అంజలి మత్తులో అంటుంది. అయినా పట్టించుకోకుండా రోహిత్ వెళ్తాడు.
అదే గదిలో బాత్రూంలో ఉన్న రాకీ బయటకు వస్తాడు. నువ్వు ఎందుకు బాత్రూం నుంచి వస్తున్నావ్, కాలేజీకి వెళ్లలేదా అని అంజలి అంటే.. ఇంత ప్లాన్ చేసి కాలేజీకి ఎందుకు వెళ్తానని రాకీ అంటాడు. అంజలిని ముట్టుకోబోతుంటే.. దగ్గరికి రాకు అని అరుస్తుంది. వినిపించుకోకుండా దగ్గరికి వస్తుండగా అక్కడ ఉన్న గాజు పూల కుండీ పగలగొట్టి దానితో తన కడుపులో పొడుచుకుంటుంది. అది చూసి రాకీ భయపడతాడు. రోహిత్ వచ్చి షాక్ అవుతాడు. తనే పొడుచుకుంది రా అని రాకీ చెప్తాడు.
అప్పుడే మనీష్ ఇంటికి వస్తాడు. కిచెన్లో అంజలి గురించి వెతుకుతాడు. మెట్లపై రక్తంతో ఉన్న అంజలిని చూసి మనీష్ షాక్ అవుతాడు. బావా అని అంజలి పిలవగానే ఒళ్లంతా రక్తంతో ఉన్న ఆమెను చూసి ఏమైందని అడుగుతాడు. గదిలో డౌట్ రాకుండా రోహిత్, రాకీ అన్నీ సర్దుతారు. మనీష్ అంజలిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. గీతకు ఫోన్ చేస్తే బిజీగా ఉండి కట్ చేస్తుంది. భానుకి ఫోన్ చేసి చెప్పగానే భాను హాస్పిటల్ కి వస్తాడు. రాకీ, రోహిత్ కూడా చాటుగా ఏం జరుగుతుందో చూడటానికి హాస్పిటల్ కి వస్తారు.
తరువాయి భాగంలో అంజలికి బ్లడ్ అవసరం పడుతుంది. అంజలిది గీతది ఒకే బ్లడ్ గ్రూప్ అని తెలిసి మనీష్ గీతకు ఫోన్ చేసి బ్లడ్ ఇవ్వమని అడుగుతాడు. ముందు ఫోన్ కట్ చెయ్ అని గీత అంటే అత్తయ్యా ఈ పరిస్థితిలో కూడా అంత కోపం అవసరమా అని మనీష్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:




.webp)
.webp)
