.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -80లో ..కొత్తగా వచ్చిన పనిమనిషిని అంజలి తెలివిగా ఇంట్లో నుంచి పంపించేస్తుంది. దీంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తుండగా మనీష్ వస్తాడు. నువ్వే కదా ఆ పనిమనిషిని పంపించావ్.. వంటల్లో ఉప్పు, కారం ఎక్కువ వేసి అని నిలదీస్తాడు. దానికి అంజలి.. అవును నేనే పంపించానని ఓపెన్ గా చెప్పేసరికి మనీష్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఇంట్లో అందరు తినకుండా ఉన్నారు. ఆకలితో ఉన్నారేమోనని అంజలి అవుట్ హౌస్ ముందు ఉప్మా చేస్తుంది. ఆ ఘుమఘుమ వాసనకు బాను బయటకు వచ్చి.. నాకూ ఉప్మా వెయ్ అంటాడు. ఆ తర్వాత మనీష్, ప్రీతీ, కృష్ణ, రత్నం కూడా వచ్చి ప్లేట్ పెట్టి ఉప్మా తింటారు. అందరు చాలా బాగుందంటూ లొట్టలేసుకుంటూ తింటారు.ఇదంతా పైనుంచి చూసిన భవిత వెంటనే గీతకు చెప్పేస్తుంది. దీంతో గీత కోపంగా కిందకు వచ్చి అంజలిపై ఫైర్ అవుతుంది.
ఈ ఇంట్లోకి రావడానికి అందరిని ఎరగా వాడుతున్నావా.. నెక్లెస్ దొంగతనం చేసిన దానివి.. రేపు ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకెళ్లవని గ్యారెంటీ ఏంటి.. ఈ వంకతో ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నావ్. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఊరుకోనని గీత వార్నింగ్ ఇస్తుంది. అంజలికి సపోర్ట్ గా ఇంట్లోవాళ్లు మాట్లాడినా గీత వినదు. తరువాయి భాగంలో
తనంతట తానే భవితే దొంగతనం చేసిందని అంజలి చెప్పేలా మనీష్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
