
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu.ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 51 లో...గీత వరలక్ష్మి వ్రతం చేస్తుండగా.. మనీష్ చాటున దాక్కొని అంజలి లలితా సహస్రనామం పాడుతుంది. ఆ తర్వాత రత్నం అందరిని కళ్ళు మూసుకోమని చెప్తుంది. వెళ్ళు, మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంజలికి రత్నం చెప్తుంది. దాంతో అంజలి వెళ్లి గీత కాళ్ళకు మొక్కుతుంది.అమ్మమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. తన సంతోషాన్ని చూసి రత్నం మురిసిపోతుంది.ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం అయ్యాక గీత పనివాళ్ళకి బట్టలు పెడుతుంది. అమ్మ చేత్తో నేనే బట్టలు తీసుకుంటానని అంజలి వెళ్తుంటే నువ్వు అలా బట్టలు తీసుకోవడం నాకు ఇష్టం లేదని రత్నం అంటుంది. అయినా అంజలి వినకుండా లైన్ లో నిల్చుని ఉంటుంది. అంజలిని చూసి గీత షాక్ అవుతుంది.
అంజలి కూడా పనిమనిషే కదా, ఇవ్వమని భాను అంటాడు. దాంతో అంజలికి బట్టలు ఇస్తుంది గీత. అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అంజలి దగ్గరికి మనీష్ వచ్చి.. నయవ్వు ఎవరు? నిన్ను ఎందుకు తాతయ్య తీసుకొని వచ్చాడు? ఇప్పుడు నానమ్మ ఎందుకు ఇంతలా సపోర్ట్ చేస్తోందని మనీష్ అడుగుతాడు. నేను అనాథను అని వాళ్ళు అలా చేశారని అంజలి చెప్తుంది. నాకు అప్పుడు ఆమె అమ్మవారిలా అనిపించిందని అంజలి అనగానేమనీష్ షాక్ అవుతాడు. నేను మీ అత్తయ్యని నాకు అమ్మగా దత్తత తీసుకోవాలి అనుకుంటున్నానని అంజలి అనగానే మనీష్ ఆశ్చర్యంగా చూస్తాడు.
మనీష్ తో అంజలి సరదాగా మాట్లాడుతుంటే భవిత చూసి.. ఇదేంటి బావతో మాట్లాడుతోంది, వెంటనే దీన్ని కట్ చేయాలని అనుకుంటుంది. మరోవైపు రాఖీ అంజలిని చూసి ఫీల్ అవుతాడు తరువాయి భాగంలో గీత తన పిల్లలకి.. మనీష్ వాళ్ళకి తినిపిస్తుంది. అదంతా అంజలి చూస్తుంది. గీత తిన్న విస్తరాకులో మిగిలిన అన్నాన్ని అంజలి తిని మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






