Home

»

Tv News

Ye Devi Varamo Neevu :అమ్మమ్మా ఇది అమ్మ నైటీ అంటూ మురిసిపోయిన అంజలి.. గీత సీరియస్!

Aug 28, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ గురువారం ఎపిసోడ్   48 లో.....గీత నైటీని అంజలికి భవి ఇవ్వడంతో అంజలి దాన్ని వేసుకుని మురిసిపోతుంది. అమ్మమ్మా, ఇది అమ్మ నైటీ అంటూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అంజలి.ఆ తర్వాత అంజలి ఆ నైటీ వేసుకుని కిందకు మంచినీళ్ల కోసం వస్తుంది. వెనక నుంచి చూసిన గీత, భవి అనుకుని.. భవి అని పిలుస్తుంది. ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఏమైంది భవి అంటూ భుజంపై చేయి వేస్తుంది. అంజలి మొహం చూసి గీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే "భవి" అంటూ గట్టిగా పిలుస్తుంది. భయంతో భవి అక్కడికి వస్తుంది.అమ్మా, నేను అమ్మమ్మ ఇవ్వమంటేనే ఇచ్చానని భవి చెప్తుంది.

 

బయటి వాళ్లు మనలాగా ఉండాలనుకోవడం తప్పు అని అంజలి బాధపడేలా గీత మాట్లాడి వెళ్లిపోతుంది. ఏంటి అంజలి, నువ్వు వేసుకున్న దానివి ఒక మూలన ఉండక.. ఎందుకు ఇలా నన్ను తిట్టించేలా చేశావని భవి కోప్పడుతుంది. దీంతో అంజలి బాధపడుతుంది. మరోవైపు అంజలి దూరంగా ఉందని రాకీ ఫీల్ అవుతాడు. ఇంకోవైపు ప్రీతి వంట చేస్తుంటే మనీష్ భయపడతాడు.

 

దాంతో ప్రీతి, అంజలికి వీడియో కాల్ చేసి ఎలా వంట చేయాలో తెలుసుకుంటుంది.ఆ తర్వాత అంజలితో మాట్లాడదామని రాకీ వస్తాడు‌. అంతలోనే ప్రీతి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మనీష్ వాళ్లకి గీత ఫోన్ చేసి.. మీరు కూడా రేపు ఇక్కడికి వచ్చేయండి అని చెప్తుంది. దీంతో రాకీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో గీత వరలక్ష్మీ వ్రతం చేస్తుంది. తన పిల్లలు ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. గీత వెళ్లిపోయాక.. ఆమె నిల్చున్న ప్రదేశంలోనే ఆశీర్వాదం తీసుకుని అంజలి సంతోషపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com