.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 73 లో..... చిన్ని రేవతిని చూసి అంజలి ఎమోషనల్ అవుతుంది. అక్కా నేను ఇక్కడే నీతోనే ఉంటానని చిన్ని ఏడుస్తుండగా భవిత వచ్చి.. పని మనిషివి పనిమనిషిలా ఉండు అంటూ అంజలిపై కోప్పడుతుంది. దీంతో మనీష్ వచ్చి భవితను.. ఆలోచించి మాట్లామంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో చిన్న ప్రాబ్లమ్ ఉందని చెప్పి రేవతి వాళ్లను అంజలి పంపించేస్తుంది. వాళ్లు వెళ్తుండగా ఉష అంజలికి కృష్ణజ వీడియోస్ చూపిస్తుంది.. ఆ వీడియోలో భవిత నెక్లెస్ తీసుకెళ్లడం అంజలి గమనిస్తుంది.
వీడియో ఆధారంతో అంజలి నేరుగా భవిత దగ్గరకు వెళ్లి.. ఎందుకు ఇలా చేశావ్, నేను నీకు ఏం అన్యాయం చేశానంటూ నిలదీస్తుంది. ఇప్పుడు నెక్లెస్ తీసుకురాకుంటే ఈ వీడియో అమ్మగారికి చూపిస్తానని బెదిరించడంతో భవిత భయపడి నెక్లెస్ తెచ్చి ఇస్తుంది. ఇప్పుడే ఈ విషయం అమ్మకి చెప్తానని అంజలి వెళ్తుండగా గీత అందరిని పిలిచి.. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నెక్లెస్ ఎక్కడ అని అడుగుతుంది. అంజలి వెంటనే నెక్లెస్ తీసి ఇవ్వడంతో అందరు షాక్ అవుతారు.
అసలు నెక్లెస్ ఎవరు తీశారని గీత ప్రశ్నించగా.. భవిత తన పేరు చెబుతుందేమోనని భయపడుతుంది. కానీ అంజలి ఎవరి పేరు చెప్పకుండా.. నెక్లెస్ నేనే దొంగతనం చేశానని తనపై వేసుకుంటుంది. దీంతో రత్నం కోప్పడి.. ఏం మాట్లాడుతున్నావే అంటూ ఫైర్ అవుతుంది. తరువాయి భాగంలో గీత అంజలిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం జరుగుతుంది. మరి అంజలి ఎందుకు నిజం దాచింది.. భవిత నిజస్వరూపం బయటపడుతుందా లేదా అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Episode 73, Star Maa Serial, Anjali, Bhavitha, Manish, Revathi, Geetha, Ratnam, Chinni, Necklace Theft]




.webp)

