.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-98 లో.. ముత్యాల్ రావు ఒక పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కార్ ని దొంగిలించి , గీతాంజలి ఇనిస్టిట్యూట్ గేట్ దగ్గరికి వస్తాడు. అక్కడ వాచ్ మెన్ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడడంతో హారన్ కొడతాడు ముత్యాల్ రావ్. ఇక సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి, జాబ్ నుండి తీసేపిస్తానని చెప్పి గేట్ ఓపెన్ చేపించుకొని గీతాంజలి ఇనిస్టిట్యూట్ లోపలికి వెళ్తాడు.
మరోవైపు ఇంట్లో అందరికి టిఫిన్ బాక్స్ లు పెడుతుంది అంజలి. వాటిని తీసుకొని ఎక్కడివారు అక్కడ బాక్స్ లు తీసుకొని వెళ్తాడు. కానీ రోహిత్ మాత్రం తన బాక్స్ తీసుకోకుండా వెళతాడు. కాసేపటికి రాకీ చెప్పిన ప్లాన్ ప్రకారం రోహిత్ తిరిగి ఇంటికి వస్తాడు. అయితే మెయిన్ డోర్ నుండి కాకుండా బ్యాక్ డోర్ నుండి వస్తాడు. ఎందుకిలా వచ్చావని రోహిత్ ని చూసిన అంజలి.. ఎందుకిలా వచ్చావని అడుగుతుంది. బాలేదని ఏదో ఒకటి కవర్ చేసి తన గదిలోకి వెళ్తాడు రోహిత్.
అప్పటికే గదిలో దాక్కొని ఉన్న రాకీ బయటకు వస్తాడు.బావ చెప్పు బావ ప్లాన్ ఏంటని రోహిత్ అంటాడు. అప్పుడే ఒక మత్తుమందు తీస్తాడు రాకీ. ఇది అంజలి మీద చల్లితే తను స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో తనని ఇంట్లో నుండి గెంటేయడం ఈజీ అవుతుందని రాకీ చెప్పగానే రోహిత్ సరేనంటాడు. మరోవైపు ముత్యాల్ రావు కాలేజీ లోపలికి వెళ్తాడు. మేనేజర్ అతని దగ్గరకి వచ్చి.. చెప్పండి సర్ ఏం కావాలని అడుగగా ఎవరు నువ్వు అని ముత్యాల్ రావు అంటాడు. అంజలి మేడమ్ కి మేనేజర్ ని అని అంటాడు. నేను ఎవరికి మేనేజర్ ని కాదు.. నాకిందే పది మంది మేనేజర్లు ఉంటారని ముత్యాల్ రావు అంటాడు. అంజలి మేడమ్ ని కలవాలని ముత్యాల్ రావు అనగానే మేడమ్ కి ఈ రోజు అప్పాయింట్ మెంట్స్ లేవని మేనేజర్ అంటాడు. వందకోట్ల బిజినెస్ డీల్ మాట్లాడదామని వచ్చానని మీటింగ్ అయ్యాక నన్ను కలవమని మీ మేడమ్ తో చెప్పమని మేనేజర్ తో ముత్యాల్ రావు అనగానే సరే సర్.. మీరు అక్కడ కూర్చోండి అని మేనేజర్ చెప్పేసి వెళ్తాడు. మరోవైపు అంజలిని ఏదో ఒకటి చేయాలని రాకీ మోసపూరిత కుట్ర వేస్తాడు . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
