స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు '(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -42 లో.... మనీష్ డల్ గా ఉంటాడు. నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చడం లేదని రత్నం అంటుంది. అంజలిని తీసుకొని మనీష్ వెళ్తుంటే జాగ్రత్త అని చెప్తుంది. ఎప్పుడు నాకూ జాగ్రత్త అని చెప్తావ్ కదా అని మనీష్ అంటాడు. ఇప్పుడు అంజలి బాధ్యత కూడా నీదే కదా అని రత్నం అంటుంది. ఆ తర్వాత కమల ఎదురుపడి చేసిన తప్పుకి చెంపలు వేసుకొని మరి క్షమాపణ అడుగమని అంజలితో చెప్తుంది. తనకి ఎలా మాట్లాడాలో తెలుసు అమ్మ నువ్వు తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని కమలతో మనీష్ అంటాడు.
మనీష్ , అంజలి కార్ లో వెళ్తుంటారు. మీడియా ముందు ఎలా మాట్లాడాలో అంజలికి మనీష్ చెప్తాడు. ఎమన్నా డౌట్ ఉంటే అడుగమని మనీష్ అనగానే మీ అత్తయ్య ప్రొద్దున ఏ టైమ్ కి లేస్తారు. ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తుందని అంజలి అడుగుతుంది. దాంతో అతను కార్ ఆపి నేను ఏం అడుగమన్నా నువ్వేం అడుగుతున్నావని మనీష్ అంటాడు. ఒక హెల్ప్ చేస్తావా మీ అత్తయ్యకి పిఏ గా చేస్తాను.. అందుకు మీ అత్తయ్యని ఒప్పిస్తావా అని అంజలి అనగానే అది జరగని పని అని మనీష్ అంటాడు. ఆ తర్వాత అంజలి మీడియా ముందుకి వెళ్లి మాట్లాడుతుంది.
అదంతా టీవీలో గీత చూస్తుంది. నేను ఆ రోజు చేసింది తప్పు.. గీతాంజలి గారు మాకు వేరొకచోట ఆశ్రయం ఇచ్చారు కానీ ఆవేశంలో అలా మాట్లాడాను ఒక తల్లిగా నన్ను క్షమించండి అని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. గీత పాజిటివ్ అవుతుంది. మనీష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు గీతకి ఒకతను ఫోన్ చేసి ఆ అంజలి ఇప్పుడు కూడా మిమ్మల్ని చెడు చెయ్యాలని చూస్తుంది. ఇంట్లో నుంచి గెంటేసాక సారీ చెప్తుంది. ఇంత మంచి అమ్మాయిని ఎలా గెంటేసిందని అనుకోవాలని ఇప్పుడు సారి చెప్పిందని అనగానే గీతకి మళ్ళీ కోపం వస్తుంది. తరువాయి భాగంలో రత్నంని గీత తన ఇంటికి రమ్మంటుంది. తనతో అంజలిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. అంజలిని చూసి గీత షాక్ అవుతుంది. ఈ ఇంట్లోకి వద్దని అంటుంది గీత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Ye Devi Varamo Neevu serial, Star Maa serial updates, Geetha Anjali storyline, Manish Rathnam Telugu serial, TeluguOne entertainment




