Home

»

Tv News

Ye Devi Varamo Neevu : నాన్న చావుకు అంజలే కారణమంటూ కోపంతో ఊగిపోయిన గీత!

Aug 20, 2026 9:47AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఏ దేవి వరమో నీవు  Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్  39 లో.... రాజారావు చనిపోయాడని తెలిసి గీత వచ్చి బోరున ఏడుస్తుంది. నేను ఇంటికి రానని శపథం చేసినందుకు.. నన్ను ఈ రకంగా ఇంటికి రప్పించావా నాన్న అని గీత ఏడుస్తుంది. తనని మనీష్ ఓదారుస్తాడు. ఆ తర్వాత రాజారావు ఫోటో దగ్గర అందరు పూలు చల్లుతారు. అంజలి వెళ్లి పూలు జల్లుతుంటే గీత ఆపుతుంది.

 

అసలు ఇదంతా నీ వల్లే కదా అని కోప్పడుతుంది. మా నాన్న నన్ను ప్రాణంలాగా చూసుకున్నాడు. అసలు మా నాన్న నీ వల్లే చనిపోయాడని అంజలిపై గీత కోప్పడుతుంది. మా జీవితంలోకి వచ్చి మా ఇనిస్టిట్యూట్ పై బురద చల్లావ్.. ఇప్పుడు మా నాన్న చావుకి కారణం అయ్యావ్..

నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని గీత అంటుంది. మా ఆడపడుచు చెప్పింది విన్నావు కదా.. తన మాటే శిలాశాసణం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కమల అంటుంది.

 

అంజలిని గీత మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. అది చూసి మనీష్ బాధపడతాడు. అంజలి ఏడుస్తూ ఒక్కతే నడుస్తూ వెళ్ళిపోతుంది. మరొకవైపు అంజలి అంటూ రత్నం పిలుస్తుంది. అంజలి లేదు అత్తయ్య తనని ఇంట్లో నుంచి పంపించిందని ప్రీతీ చెప్తుంది. తరువాయి భాగంలో అంజలిని తీసుకొని రమ్మని మనిష్ ని రత్నం పంపిస్తుంది. అంజలి వర్షం లో తడుస్తుంటే మనీష్ వెళ్లి తన షర్ట్ ఇచ్చి ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com