స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -30 లో..... మనీష్ ని తీసుకొని అంజలి మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ గీతాంజలి ఎంప్లాయి అంజలిని చూస్తాడు. మరొకవైపు గీతాంజలి బానుకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ ల మీద ఫోన్ లు వస్తాయి. అప్పుడే ఆ ఎంప్లాయి వచ్చి ఇద్దరిని విష్ చేస్తాడు. మార్కెట్ లో అంజలి కన్పించిన విషయం చెప్తాడు.
నేను దగ్గరికి వెళ్లి చూసేలోపు వెళ్లిపోయిందని అతను చెప్తాడు. ఈ విషయం వెంటనే మనీష్ కి చెప్పాలని గీతాంజలి ఫోన్ చేయబోతుంటే అప్పుడే భాను అపుతాడు. ఈ రోజు మన పెళ్లి రోజు ఆ విషయం మర్చిపోకు.. అవన్నీ పక్కన పెట్టు అని రిక్వెస్ట్ చేస్తాడు. మరొకవైపు కొన్నసరుకులు అన్నీ మనిష్ తో మోయిస్తుంది అంజలి. ఒక ట్రాలీ ఆటోలో సరుకులు వేసి వెనకాల మనీష్ నీ కూర్చోమని చెప్తుంది. ఆ తర్వాత పెళ్లి రోజుకి ఏర్పాట్లు అన్ని గ్రాండ్ గా చెస్తారు. అప్పుడే మనీష్ వస్తాడు. కాసేపటికీ రాజారావు వస్తాడు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. అవును నాన్న మీరు ఎప్పుడు ఈ రోజు సంతోషం గా ఉంటారని శంకర్ అంటాడు.
కానీ ఈసారి ఎందుకో ఎక్కువ హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుందని శంకర్ అంటాడు. ఆ తర్వాత గీతాంజలి ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుంది. అందరు వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు. ముందే రావాల్సింది కదా అని రత్నం అంటుంది. బావ వద్దని చెప్పాడని భవి అంటుంది. తాతయ్య చెప్పమన్నాడు.. ముందే వస్తే అన్ని పనులు మీరు చేయాల్సి వస్తుందని టైమ్ కి రమ్మన్నారని మనీష్ అంటాడు. అంతేనా లేకపోతే మీ తాత, మనవడు ఏదైనా కుట్ర చేస్తున్నారా అని భాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




