Home

»

Tv News

Ye Devi Varamo Neevu: గీతాంజలి కంట పడ్డ అంజలి.. అసలు నిజం బయటపడుతుందా?

Aug 7, 2026 9:57AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో‌ నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-28 లో..  అంజలి కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటే తన దగ్గరికి శివశంకర్ భార్య అయినటువంటి కమల వస్తుంది.  అంజలినే అదేపనిగా కమల చూస్తుంటే ఏంటి మేడమ్ అలా చూస్తున్నారని అంజలి అడుగుతుంది. నిన్ను చూసి నా కూతురు ఏం నేర్చుకోవాలా.. నీలో ఏం ఉందో చూస్తున్నానని కమల అంటుంది‌ . అదేంటి మేడమ్ అని అంజలి అనగానే... నువ్వు ఒక పనిమనిషివి అంతేగానీ నా కూతురు ఎక్కడ నువ్వెక్కడ.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని కమల అనగానే అంజలి బాధపడుతుంది.

ఆ తర్వాత అంజలి తన పనులు చూసుకుంటుంటే రాకీ వచ్చి తనని మాటలతో ఇబ్బంది పెడతాడు. తనతో ఫ్లర్ట్ చేస్తుంటే అంజలికి అర్థమై రాకీని దూరం పెడుతుంది.‌ఎలాగైనా తనని దక్కించుకోవాలని రాకీ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు గీతాంజలి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మనీష్ అండ్ రాజారావు వాళ్ళ ఫ్యామిలీ కూడా డిన్నర్ చేస్తుంటారు. ఇక శివశంకర్ ట్యాబ్ పట్టుకొని అంజలి ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతుంటాడు‌.

ఇక అదే సమయంలో అంజలి అందరికి భోజనం వడ్డిస్తుంది.‌ మరోవైపు ఎక్కడ అంజలిని గీతాంజలి చూస్తుందోనని మనీష్, రాజారావు టెన్షన్ పడతారు. ఇక శివశంకర్ తింటుంటే అంజలి తనకి వడ్డిస్తుంది అప్పుడే గీతాంజలి తనని చూస్తుంది. ఎవరు అన్నయ్య తను అని గీతాంజలి అడుగగా పనిమనిషి అని చెప్తాడు. తనని ఎక్కడో చూసినట్టుగా ఉందని గీతాంజలి అనగానే ఆమెని ఒకసారి రమ్మని చెప్పమని గీతాంజలి అడుగుతుంది. దాంతో మనీష్ టెన్షన్ పడతాడు. ఇక మనీష్ ఏదో ఒకటి చేసి కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com