Home

»

Tv News

Ye Devi Varamo Neevu : మనీష్ ఇంట్లో అంజలి ప్రత్యక్షం.. ఊహించని ట్విస్ట్‌తో రసవత్తరంగా కథనం!

Jul 25, 2026 10:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో..... అంజలిని మనీష్ తన ఇంట్లో చూసి షాక్ అవుతాడు. నన్నే వెతుక్కుంటూ వచ్చాడని అంజలి అనుకొని తనని పంపించాలనుకుంటుంది. సెక్యూరిటీ ద్వారా తనే ఆ ఇంటికి ఓనర్ అని మహాకి తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మనసుల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. అసలు నేను రమ్మంటే రాలేదు .. తనే వెతుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వచ్చిందని మనీష్ అనుకుంటాడు.

నేను వచ్చింది వాళ్ళ ఇల్లా అని అంజలి షాక్ లో ఉంటుంది. ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అంజలిపై మనీష్ కోప్పడుతాడు. వెంటనే రాజారావు దగ్గరికి మనిష్ వెళ్లి తాతయ్య తనని అసలు ఎందుకు రప్పించావని అడుగుతాడు. రప్పించాల్సి వచ్చిందని రాజారావు చెప్తాడు. తను అంటే గీతాంజలి అత్త అంటే ఎంత కోపమో తెలుసు కదా అని మనీష్ అంటుంటే రాజారావు పొంతన లేని సమాధానం చెప్తాడు.

మరొకవైపు గీతాంజలితో తన అడ్వైజర్ మాట్లాడతాడు. ఆ అంజలి వల్ల మీకు ఇలా బ్యాడ్ నేమ్ వచ్చింది.. ఇప్పుడు తనే మీడియా ముందుకి వచ్చి మేం తప్పుగా అపార్ధం చేసుకున్నామని క్షమించమని అడగాలని అతను చెప్పగానే అవును మనీష్ నువ్వు ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే తీసుకొనిరా ని గీతాంజలి చెప్తుంది. తరువాయి భాగంలో  అత్తయ్య అంజలిని తీసుకొని రమ్మని చెప్పిందని రాజారావు తో మనీష్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com