
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 41 లో.....నేను ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనని రత్నంకి అంజలి మాటిస్తుంది. మరొకవైపు రాజారావ్ ఫోటో చూస్తూ మనీష్ ఏడుస్తాడు. దాంతో ఇంట్లో అందరూ వస్తారు. ఆ తర్వాత అంజలి గోడకి ఉన్న ఫోటో చూస్తూ నాకు ఇంతపెద్ద ఫ్యామిలీ ఉందా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది . మనీష్ ని చూసి తను బావ అని అనుకుంటుంది.
అప్పుడే మనీష్ వచ్చి అంజలి భోజనం చేద్దామని పిలుస్తాడు. నాకు ఆకలిగా లేదు బావ అని అంజలి అనగానే ఏంటి బావనా అని మనీష్ అనగానే లేదు పోవా అన్నానని అంజలి కవర్ చేస్తుంది. ఆ తర్వాత అంజలి ఒంటిరిగా కూర్చొని ఆలోచిస్తుంటే మనీష్ వస్తాడు. మీ అత్తయ్యకి నాపై కోపం పోయేలా చెయ్యవా అని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో నువ్వు దానికి ఒప్పుకోవు కదా అని మనీష్ అంటాడు. లేదు ఒప్పుకుంటానని అంజలి అనగానే నువ్వు అందరి ముందు మా అత్తయ్యకి సారీ చెప్పాలని మనీష్ అనగానే సరే అని అంజలి చెప్తుంది. దాంతో మనీష్ ఆశ్చర్యంగా చూస్తాడు.
మరుసటిరోజు రాజారావు ఫోటో దగ్గర గీత దీపం పెట్టి ఏడుస్తుంది. అప్పుడే భాను వచ్చి ఓదారుస్తాడు. ఆ తర్వాత ఇన్ని రోజులు బావతో కాలేజీకి వెళ్లేదాన్ని ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండడం లేదని భవి డిస్సపాయింట్ అవుతుంది. అప్పుడే గీత వచ్చి భవి త్వరగారా కాలేజీలో డ్రాప్ చేస్తానని అంటుంది. తరువాయి భాగంలో గీత గురించి అంజలి మీడియా ముందు చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
