Home

»

Tv News

Ye Devi Varamo Neevu: అంజలిని మైకంలోకి దించేందుకు రాకీ కుట్ర.. రోహిత్ సహకారం.!

Oct 25, 2026 11:47AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్  శనివారం నాటి ఎపిసోడ్-99 లో రోహిత్, రాకీ కలిసి అంజలిపై పెద్ద ప్లాన్ వేస్తారు. అంజలి మైకంలో ఉండేలా చేయాలని రోహిత్ కి రాకీ ప్లాన్ చెప్తాడు. రోహిత్ అంజలిని పిలిచి.. ఈ బట్టలు చికాకుగా ఉన్నాయి, కాస్త సర్దమనగానే అంజలి హ్యాపీగా సర్దుతుంది. వెనక నుంచి మత్తు స్ప్రే చేయాలని ట్రై చేస్తాడు కానీ ఫెయిల్ అవుతుంది. దీంతో రాకీ మరో ప్లాన్ చెప్తాడు.

మరోవైపు గీతను బ్లాక్ మెయిల్ చేయడానికి ముత్యాలరాజు కాలేజీకి వెళ్తాడు. క్లర్క్ విషయం గీతకు చెప్పగానే.. నేను ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని గీత అంటుంది. మనీష్ వెళ్లి.. ఎందుకు వచ్చారని అడిగితే ముత్యాలరావు తలతిక్క సమాధానం చెప్పి.. గీత మేడంతోనే మాట్లాడాలని అంటాడు. ఇదే సమయంలో అంజలిని రోహిత్  "అక్కా జ్యూస్ తీసుకురా" అని పిలవగానే అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సారీ అక్కా నిన్ను కొట్టానని మాటల్లో పెట్టి జ్యూస్ లో టాబ్లెట్ కలుపుతాడు. అక్కా నువ్వు ఈ జ్యూస్ తాగమని ఇవ్వగానే అంజలి తాగి.. ఏదో మత్తుగా ఉందని అంటుంది.

అంజలి మత్తులోకి వెళ్లగానే రోహిత్ బయటకు వెళ్లిపోతాడు.  రాకీ గదిలోనే ఉంటాడు. ఇన్నాళ్లకి దొరికావని  అంజలి వైపు రాకీ  వెళ్తాడు. మరోవైపు ముత్యాలరావు కార్ దొంగతనం చేసి తీసుకొచ్చిన కారు విషయంలో ఓనర్ గొడవ పెడుతుంటే గీత రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎవరు అతను, నన్నే ఎందుకు కలవాలనుకున్నాడని గీత కోప్పడుతుంది .

తరువాయి భాగంలో అంజలిని రాకీ బలవంతం చేయబోతుండగా అప్పుడే మనీష్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అంజలిని మనీష్ కాపాడతాడా, ముత్యాలరాజు గీతను బ్లాక్ మెయిల్ చేస్తాడా అనేది ఉత్కంఠగా మారింది.

 

 

 

[Ye Devi Varamo Neevu Serial Episode 99, Ye Devi Varamo Neevu Today Episode, Ye Devi Varamo Neevu Latest Episode, Ye Devi Varamo Neevu Episode 99, Ye Devi Varamo Neevu Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com