Home

»

Tv News

Ye Devi Varamo Neevu: భవిత దొంగతనం బయటపెట్టిన మనీష్.. రత్నం కిందపడటంతో షాక్!

Oct 4, 2026 12:49PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-81 లో అంజలి బాధపడుతూ కూర్చుంటే మనీష్ వచ్చి.. ఎందుకు ఆ దొంగని కాపాడాలి అనుకుంటున్నావని కోప్పడతాడు. ఇప్పటికైనా ఆ దొంగ పేరు చెప్పమని నిలదీసినా అంజలి సైలెంట్ గా ఉంటుంది. 

మరోవైపు రోహిత్ ని రాకీ డ్రింక్ చేసే ప్లేస్ కి తీసుకెళ్తాడు. కూల్ డ్రింక్ అని చెప్పి డ్రింక్ తాగిస్తాడు. రోహిత్ ఫుల్ గా తాగి పడిపోతాడు. మరోవైపు భవిత డాన్స్ చేస్తుంటే ఒక పేపర్ కాలికి తగులుతుంది. అది ఓపెన్ చేసి చూస్తే.. ఈ దొంగ అనే నింద భరించడం నా వల్ల కాదు, ఇక అమ్మగారికి చెప్పేస్తా, ఒకసారి మాట్లాడాలి టెర్రస్ పైకి రా అని ఉంటుంది. దీంతో భవిత కంగారుగా టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడ మనీష్ ఉంటాడు. ఎందుకు వచ్చావని మనీష్ అడిగితే చల్లగాలి కోసమని భవిత కవర్ చేస్తుంది.

ఆ తర్వాత మనీష్ హడావిడిగా అంజలి దగ్గరికి వెళ్లి.. దొంగ ఎవరో తెలిసింది, వెళ్లి అత్తయ్యకి చెప్దాం పదా అని అంజలి చెయ్యి పట్టుకుని వెళ్తాడు. వద్దు, భవిత దొంగతనం చేసిందని తెలిస్తే అమ్మగారు తట్టుకోలేరని అంజలి అంటుంది. దీంతో మనీష్ షాక్ అవుతాడు. ఇప్పటివరకు డౌట్ ఉండేది.. నువ్వు క్లారిటీ చేశావని మనీష్ అంటాడు. నీకు తెలిసింది అన్నావ్ కదా అని అంజలి అంటే.. లేదు, డౌట్ ఉండేది, నువ్వు రాసినట్టు ఒక లెటర్ భవితకు రాశాను.. అప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు క్లారిటీ వచ్చిందని మనీష్ అంటాడు. వెళ్లి అత్తయ్యకి చెప్దామని మనీష్ అంటుంటే వద్దని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది.

తరువాయి భాగంలో.. రత్నం కింద పడిపోతుంది. అది అంజలి కిటికీలో నుండి చూసి అందరిని పిలుస్తుంది. అందరు రాగానే.. నన్ను అంజలి మాత్రమే బాగా చూసుకుంటుందని రత్నం అనగానే నేను నీ కన్నా బాగా చూసుకుంటాను.. నువ్వు వారం రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అంజలితో గీత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com