Home

»

Tv News

హగ్ అడిగిన టేస్టీ తేజ... విషమిచ్చి చంపేస్తానన్న యష్మి

Oct 16, 2026 6:13PM

టేస్టీ తేజ వంటస్టిక్ కార్యక్రమంతో హోస్ట్ గా చేస్తున్నాడు. అలాగే సీరియల్స్ లో సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న వాళ్ళను గెస్టులుగా తీసుకొచ్చి వాళ్ళతో రెసిపీస్ చేయిస్తూ రకరకాల విషయాలను అడుగుతున్నాడు. ఇక రీసెంట్ షోకి యష్మి గౌడ వచ్చింది. ఇక పాల తాలికలను తేజ చేసాడు. కరివేపాకు కొబ్బరి అన్నం చేసింది యష్మి. అలాగే తన పెళ్లి గురించి ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది.

" అసలు  ఇంతకీ నీ లైఫ్ లోకి రాబోయే అబ్బాయికి  ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పు" అని టేస్టీ తేజ అడిగాడు. " క్వాలిటీస్ ఆ  అస్సలు నీలాగా ఉండకూడదు  " అని చెప్పింది  యష్మి  . " ఇదేం క్వాలిటీ ఇప్పుటి దాకా ఎంతో
మంది  చెప్పారు ఎవరు ఈ క్వాలిటీ చెప్పలేదు" అన్నాడు తేజ.  "నాకు   ఫస్ట్ నీలాగా ఉండకూడదు. నీలాగా  మోటివేషన్ కి హగ్ అడగకూడదు అంది.   "యష్మి ప్లీజ్ క్రష్ మీ  " అని ఆటపట్టించాడు తేజ. వెంటనే యష్మి  "మళ్ళీ మళ్లీ ఇలాంటి   క్వాలిటీస్ వద్దు అంటున్నా "అంది.  "నువ్వు కాబోయే హస్బెండ్ ఎలా  ఉండాలో చెప్పట్లేదు కాబట్టి  నీ ఫస్ట్ క్రష్  గురించి చెప్పు " అన్నాడు తేజ. " నా  ఫస్ట్ క్రష్  స్కూల్ డేస్ లో అంటే నేను 8 వ  క్లాస్ లో  ఉన్నప్పుడు ఆయన 10 వ   తరగతి. అతన్ని నేను  ఎగ్జామ్ హాల్ లో చూసాను . నేను చదువుకొని వెళ్ళలేదు వాడు చదువుకొని వెళ్ళలేదు . ఖాళీగా ఉండి   ఏం చేయాలో అర్థం కాక  
ఒకరిని ఒకరు  చూసుకున్నాం అప్పుడు.  అంతే అక్కడికే  ఇంకా అక్కడికే ఆగిపోయింది.  " అని చెప్పింది యష్మి. " నీకెంత ఏజ్  " అని అడిగింది. "అరే నీది నాది సేమ్ యా   సిక్స్ మంత్స్  గ్యాప్ అన్నాడు తేజా. " ఫస్ట్ టైం  
నువ్వు నీ లైఫ్ లో చేసిన  ఫస్ట్ ఫస్ట్ వంట ఏంటో  చెప్పవా... అది  తిన్నది ఎవరో
ఇప్పటిదాకా ఉన్నారా" అని అడిగాడు. " ఓయ్యో   అది మాత్రం అడగకు ఎందుకంటే నేను బెండకాయతో ఫ్రైడ్ రైస్ చేసి నేనే  నోట్లో పెట్టుకొని
 ఉమ్మేసాను.  నేను మర్చిపోలేను మొత్తం వేస్ట్ చేసాను మా  మమ్మీ ఫుల్ గా కొట్టారు నన్ను " అని చెప్పింది. "మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా నువ్వే చూసుకుంటున్నావా " అని అడిగాడు. " చూడట్లేదు  ఇప్పుడు. అందరూ  వదిలేసారు నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరని  " అంది. " ఏయ్ ఎందుకు  మామయ్య
అట్లా అంటావు  పక్కన అల్లుడుని పెట్టుకొని . మీ నాన్న నాకు మెసేజ్ పెట్టారు. నువ్వు   బెంగళూరు వచ్చినప్పుడు ఇంటికి రా అల్లుడు" అని  చెప్పాడు. " మరి ఎందుకు రాలేదు కొంచెం విషం వేసి  చంపేస్తా నేను " అంది కోపంగా యాష్మి.
 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com