Home

»

Tv News

ఈ సీజ‌న్ విన్న‌ర్ అత‌నేనా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

Dec 05, 2021

 

బిగ్ బాస్ సీజ‌న్ 5 రియాలిటీ షో క్లైమాక్స్‌కి చేరుకుంది. దీంతో ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ చ‌ర్చ‌లో ఎవ‌రికి న‌చ్చిన వ్య‌క్తిని వారు విన్న‌ర్ అంటూ చెప్ప‌డం మొద‌లుపెట్టారు. ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఫైన‌ల్ డేన ష‌ణ్ణు టైటిల్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం.. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీని అందుకుంటున్న‌ట్టుగా పిక్స్‌ని మార్ఫింగ్ చేసి నెట్టింట ప్ర‌చారం మొద‌లుపెట్టారు.

Also read:  `బిగ్‌బాస్‌` నుంచి ఆమె ఎలిమినేట్‌!

గ‌త సీన్ విజేత అభిజీత్ ఫొటోల‌ని మార్ఫింగ్ చేసి ఆ ఫొటోల్లో ష‌ణ్ణుని చేర్చి ఆ ఫొటోల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే మెజారిటీ వ‌ర్గం ఆడియ‌న్స్ టాక్ మాత్రం మ‌రోలా వుంది. .జెన్యూన్‌గా ఆడుతున్న కంటెస్టెంట్ ఈ సీజ‌న్ విజేత‌గా నిల‌వ‌బోతున్నాడ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. ప‌బ్లిక్ యునానిమ‌స్‌గా ఈ సీజ‌న్ విన్న‌ర్ అని చెబుతున్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు స‌న్నీ. స‌న్నీ టాస్క్‌ల‌లొ ఫైర్‌గా , అగ్రెసీవ్‌గా క‌నిపించినా త‌ను ఎలాంటి యాక్టింగ్ చేయ‌డం లేద‌ని, త‌న‌కు ఏం అనిపించిందో అది నిజాయితీగా చేస్తున్నాడ‌ని.. గేమ్ పూర్త‌యిన త‌రువాత గేమ్‌లో జ‌రిగిన‌వ‌న్నీ ప‌క్క‌న పెట్టి చాలా స‌ర‌దాగా వుంటున్నాడని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

Also read:  ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌

తాజాగా ఓ మీడియా నిర్వ‌హించిన ప‌బ్లిక్ టాక్ లో మెజారిటీ వ‌ర్గం స‌న్నీపై ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డంతో స‌న్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా స‌న్నీనే నిలిచే అవ‌కాశాలు వున్నట్టుగా ఓటింగ్ స‌ర‌ళి కూడా తెలియ‌జేస్తోంది. టిక్కెట్ టు ఫినాలే ని శ్రీ‌రామ‌చంద్ర సొంతం చేసుకోవ‌డానికి కార‌ణం ఇటీవ‌ల జ‌రిగిన ఐస్ బౌల్ టాస్క్‌. ఈ టాస్క్ త‌రువాత ప్రియాంక చేసిన సొంత వైద్యం కార‌ణంగా శ్రీ‌రామ చంద్ర న‌డ‌డానికి ఇబ్బందిప‌డిన విష‌యం తెలిసిందే. అదే అత‌న్ని టిక్కెట్ టు ఫినాలేలోకి ఎంట‌ర్ అయ్యేలా చేసింద‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఓవ‌రాల్‌గా మాత్రం స‌న్నీనే ఈ సీజ‌న్ విజేత అని మెజారిటీ వ‌ర్గం ప్రేక్ష‌కులు చెబుతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com