
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో వివి . వినాయక్ కనిపించారు. అలాగే అనిల్ రావిపూడి కూడా. ఇక అనిల్ రావిపూడి వివి. వినాయక్ ని హగ్ చేసుకున్నారు. " నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది ఆది అనే సినిమా చూసాకే . ఇన్ డైరెక్టులి మీరే నా గురు. ఈ మధ్య టెస్లా కార్ ని గాల్లోకి ఎగరేసాడు. కానీ అంతకుముందే వినాయక్ గారు సుమోలు అలాంటివి ఎన్నో గాల్లోకి ఎగరేశారు " అని చెప్పేసరికి వినాయక్ పగలబడి నవ్వేశారు.
ఇక తర్వాత అనిల్ రావిపూడి లేడీ ఫాన్స్ అంతా స్టేజి మీదకు వచ్చారు. ఇక ఎఫ్ 2 మూవీలో తమన్నా మొగుడిని సాధించే రోల్ చూస్తే తనలాగే అనిపించిందని, ఇలాంటి డైరెక్టర్ ఎవర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్ అంటూ ఫాన్స్ అంతా చెప్పుకొచ్చారు. అలాగే ఆయన మూవీస్ అన్నిటితో కలిపి చేసిన ఒక లామినేషన్ ని ప్రెజెంట్ చేసారు. ఆ తర్వాత వినాయక్ మాట్లాడారు. "పేరే తెలియని ఒక అబ్బాయి ఇండస్ట్రీకి రావడానికి కారణం వినాయక్ గారు అని రాసినప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ప్లాప్ లేకుండా ట్రావెల్ చేస్తున్న డైరెక్టర్స్ మీరిద్దరే . ఇంకా మీకు గ్రేట్ ఫ్యూచర్ ఉంది " అంటూ అనిల్ రావిపూడిని ఆశీర్వదించారు. ఆయన వినాయక కాళ్లకు దణ్ణం పెట్టుకున్నారు.
అనిల్ రావిపూడి సంక్రాంతి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఫామిలి డ్రామాలో కామెడీ మిక్స్ చేసి తీసి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. మొదట ఇండస్ట్రీలో ఆయన డైలాగ్ రైటర్ గా చేశారు. శంఖం, కందిరీగ, మసాలా, ఆగడు వంటి మూవీస్ కి డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరూ, భగవంత్ కేసరి, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి మూవీస్ చేసి హిట్ కొట్టారు.






