
సోషల్ మీడియా వ్యాప్తి ఎంత స్పీడ్ గా పెరుగుతుందో నెగటివ్ కామెంట్స్ వేగం కూడా అంతే స్పీడ్ గా పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వేణు స్వామి గురించి కానీ అతని భార్య వీణా శ్రీవాణి గురించి కానీ చెప్పక్కర్లేదు. వీణ శ్రీవాణి అద్భుతంగా వీణ వాయిస్తుంది. కొత్త పాత సాంగ్స్ కి మంచి మ్యూజిక్ అందిస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తుంది. అలాంటి వీణ శ్రీవాణి రీసెంట్ గా ఒక రీల్ ని పోస్ట్ చేసింది. అది ఒక కామెంట్ గురించి చెప్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ఆ నెగటివ్ కామెంట్ ఏంటి ఆమె దానికి ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం.
"నాకు ఇప్పుడు ఒకడు మెసేజ్ పెట్టాడు. అది ఒక్కడా ఒకతా తెలీదు. అదొక ఫేక్ అకౌంట్. స్క్రీన్ షాట్ తీసుండాల్సింది కానీ కోపంలో బ్లాక్ చేసేసాను కంప్లైంట్ ఇచ్చి. "నీవు శీలవతివేనా ? ఐతే మీ ఆయన మీద ఒట్టేసి చెప్పు ?అన్నాడు. ఒరేయ్ నేను శీలవతిని కాదురా నిజంగా శీలవతిని కాదు. ఎందుకంటే నేనొక పర్ఫెక్ట్ మహిళను. 9 నెలలు ఒక బేబీని మోసి కనే టైములో క్రిటికల్ సిట్యువేషన్ లో సిజేరియన్ చేయాలి అన్నప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నది ఎవరో తెలుసా అనెస్థీషియన్ మొగాయన ఒక డాక్టర్ మగాయన కంపౌండర్స్ మగవాళ్ళు వీళ్లందరి ఎదురుగా నా శీలాన్ని చూపిస్తూ నా బేబీని నేను కన్నానురా . నా లాంటి ఆడవాళ్లు ప్రపంచంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందులో నీ అమ్మ నీ అక్క నీ చెల్లి నీ పెళ్ళాం నాకు అనిపిస్తూ ఉంటుంది కరోనాలో ఎంతోమంది మంచి వాళ్ళు చచ్చిపోయారు. మీలాంటి వాళ్ళు ఇంకా అలా వేళ్ళాడుతున్నారు. ఎం ఉపయోగంరా దేశానికి మీవల్ల. ఆడవాళ్లు ఇంత సాధిస్తున్నారు ఇంత కష్టపడుతున్నారు. మమ్మల్ని చూసి ఎం సాధిస్తున్నామో ఎంత కష్టపడుతున్నామో చూసి నేర్చుకోవచ్చు కదా. ఎం కామెంట్లు రా ఇవి. మిమ్మల్ని ఎవరూ మార్చలేరుగా. మిమ్మల్ని అందరూ వెధవలనే గుర్తుపెట్టుకుంటారు. మీరు అలాగే ఉండండి. " అంటూ వీణా శ్రీవాణి తనదైన శైలిలో ధైర్యంగా కామెంట్ పెట్టిన వాళ్లకు బుద్ది చెప్పింది.
నెటిజన్స్ కూడా ఈ కామెంట్ మీద రియాక్ట్ అవుతున్నారు. సూపర్ అండి బాగా చెప్పారు. పాపి చిరాయువు వీణా గారు మీరు వాళ్ళు కోసం సమయం కేటాయించకండి. మీ అరికాలు మట్టి అండి వాడు.. బాధగా ఉంటది బట్ కర్మ అనేది ఉంటది కదా అది చూసుకుంటుంది. చాలా బాగా బుద్ది చెప్పారు. అమ్మ అనే మాటకు అర్థం తెలియన వెధవ గాని వెధవదిగాని అన్న మాటలకు చక్కని సమాధానం చెప్పారు అమ్మ. మీకు మీ చిరునవ్వే అందం అలాంటి వెధవలకి.మీ నవ్వు తోటే సమాధానం చాలా గట్టిగా ఇచ్చారు. చావకోట్టి చెవులు మూసావ్" అంటూ నెటిజన్స్ అంతా ఆమెకు సపోర్ట్ చేస్తూ రిప్లైస్ ఇస్తున్నారు.




.webp)
