
జోర్దార్ సుజాత బుల్లితెర మీద పాపులర్ స్టార్. ఆమె భర్త రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కమెడియన్. వెళ్లి అన్ని షోస్ లో కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా సుజాత వంటస్టిక్ షోకి వచ్చి తాను రాస్తున్న ఒక బుక్ గురించి చెప్పింది. అలాగే ఇంకా ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
"నేను రీసెంట్ గా బుక్ రాయడం స్టార్ట్ చేసాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గర్ల్స్ అందరి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద ఉంటుంది. అందరికి సంబంధించింది. డెలివరీ తర్వాత ఆడోళ్ళంతా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అది. నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కోసమే నేను బుక్ రాయడం స్టార్ట్ చేశా" అని చెప్పింది. వెంటనే టేస్టీ తేజ "మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఒక ఇండస్ట్రీలో ఉండడం వలన వచ్చే లాభాలు నష్టాలు ఏంటి" అని అడిగాడు. "లాభాలు ఏంటంటే ఇద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వారి వారి వర్క్ ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉంటుంది.
ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా ఫేస్ చేయడానికి ఇద్దరం ముందు ఉంటాం. నాకేమన్నా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ముందు మా ఆయనే ఉంటాడు. ఎటు నుంచి ఏ ప్రాబ్లమ్ వస్తుందో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అన్ని విషయాలు అమ్మాయిలకు తెలీదు కాబట్టి కొన్ని విషయాల్లో మగాళ్లు ఇన్వాల్వ్ ఐతేనే బాగుంటుంది. నష్టం వచ్చి సోషల్ మీడియా నెగటివిటీ. అందులో వచ్చే కామెంట్స్ కానీ ఏదైనా ఫామిలీ పరంగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే పెద్ద మైనస్. ప్రెగ్నెంట్ అయ్యే ముందు వరకు ఆ నెగటివిటీ చూసి అగ్రెసివ్ ఐపోయేదాన్ని కానీ తర్వాత బుక్ రాయడం స్టార్ట్ చేశా. ఇంకా ఆ బుక్ కి పేరు పెట్టలేదు. స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ బుక్ కి పేరు పెడతాను." అని చెప్పింది.
"మరి షూటింగ్స్ ఇద్దరూ వచ్చేసినప్పుడు పాపా ఖ్యాతికను మిస్ అవ్వవా" అని అడిగాడు." మిస్ అవుతాను. అది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తోంది. దేవుడి దయ వలన ఇంట్లో అత్తగారు తోడికోడలు ఉన్నారు. మా మరిది వాళ్ళ పాప కూడా ఉంటుంది. కాబట్టి పాపా నన్ను మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంటికెళ్ళాక నేను కాసేపు నవ్వి ఆడుకుని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది.





