
కొన్ని ప్రోగ్రామ్స్ కి అసలు ఎండ్ అనేదే ఉండదు. ఎన్ని రకాలుగా ప్రెజెంట్ చేసినా ఆడియన్స్ ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా డాన్స్ షో , కామెడీ షో, కుకింగ్ షో . ఇవి ఎవర్ గ్రీన్ సబ్జక్ట్స్. అలాంటిదే ఇప్పుడు సరికొత్తగా సన్ జెమినిలో ఒక వంటల కార్యక్రమం రాబోతోంది. అదే "వంటాస్టిక్". ఈ షో టైటిల్ కూడా రెండు పదాలతో వంట, ఫెంటాస్టిక్ వీటిని కలిపి వంటాస్టిక్ అని ఫిక్స్ చేశారు.
అది కూడా ఈ నెల 25 నుంచి సోమవారం నుంచి శని వారం వరకు మధ్యాహ్నం 2.30 టైం స్లాట్ లో రాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా ఆరియానా కనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియా ఒక మోస్తరు సెలబ్రిటీస్ కూడా వచ్చి ఈ వంటలను టేస్ట్ చేసి సరదాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఐతే ఈ ప్రోమోలో నైనికా అనసూర, ఆర్జే సూర్య, రోల్ రైడ, సయ్యద్ సోహైల్ ర్యాన్ వచ్చారు.
"అమ్మాయిలు, అబ్బాయిలు, వంట వచ్చిన వాళ్ళు, వంట రాని వాళ్ళు గెట్ రెడీ. " అని చెప్పింది ఆరియానా. "మీ మధ్యాహ్నాన్ని మరింత టేస్టీగా క్రేజీగా మార్చడానికి వస్తోంది ఫెంటాస్టిక్ కుకరీ షో" అని చెప్పారు. "సింహంతో వేట ఈ కాంటం గాడి వంట పిచ్చెక్కిస్తా" అని చెప్పాడు. ఒకప్పుడు కేవలం కుకింగ్ షోస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కుకింగ్ తో పాటు కామెడీ స్కిట్స్ తో ఫన్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మరీ కుకింగ్ షోస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇక కూకు విత్ జాతిరత్నాలు అనే షో ఇప్పుడు ఆడియన్స్ ని అలరిస్తోంది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే పేరుతో గతంలో ఒక షో వచ్చింది సుమ హోస్ట్ గా. ఇలా రకరకాల కుకరీ షో




.webp)
.webp)
