
బిగ్ బాస్ తెలుగు 10 నామినేషన్స్ ఫుల్ ఆఫ్ ఫైర్ తో సాగాయి. G.O.A.T విన్నర్ అయిన త్రిగుణ్ మూడు నామినేషన్స్ చేయడంతో హౌస్ లో హీట్ పెరిగింది. మొదట రామ్ ప్రసాద్ ని త్రిగుణ్ నామినేట్ చేశాడు. కెప్టెన్సీలో ఉన్నప్పుడు అసర్టివ్ గా లేవని, కానీ ఫ్రెండ్లీగా ఉండటం నచ్చిందని చెప్పాడు. రామ్ ప్రసాద్ దీన్ని స్పోర్టివ్ గా తీసుకున్నాడు. కానీ రోహిత్ విషయంలో మాత్రం నామినేషన్ కాస్త కాన్ఫ్రంటేషనల్ గా మారింది. అగ్ని పరీక్షలో అంత పేషెన్స్ చూపించిన రోహిత్, హౌస్ లోకి వచ్చాక ఎందుకు అంత అరోగెంట్ గా మారుతున్నావని త్రిగుణ్ డైరెక్ట్ గా ప్రశ్నించాడు. దీనికి రోహిత్ రిటాలియేట్ అవుతూ పర్సనల్ అటాక్స్ చేయడం మొదలుపెట్టాడు. మరోసారి త్రిగుణ్ ఫ్యామిలీని లాగడంతో గొడవ పీక్స్ కి వెళ్లింది. రోహిత్ తరచూ ఫ్యామిలీని టార్గెట్ చేయడంపై ఆడియన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రామకృష్ణ(RK)ని ముఖేష్ నామినేట్ చేశాడు. చాలా వారాలుగా హౌస్ లో ఉన్నా ఇంకా గార్డెడ్ గా ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని కారణం చెప్పాడు. ఇంకా టైనింగ్ టేబుల్ దగ్గర నీట్ గా ఉంచకుండా దానిని పాడుచేశావ్.. నీలాంటి మూర్ఖుడు వస్తే ఈ హౌస్ కి ఏం ఉపయోగం ఉండదని ముఖేష్ అనగానే నీకు తెలుగు సరిగ్గా రాదు.. అసలు తెలుగు పదాలు సరిగ్గా తెలియవని RK అన్నాడు.
ఇక సుధీర్ ని అమన్ నామినేట్ చేశాడు. షాడో సుధీర్, ఫ్లిప్పర్ సుధీర్.. ఫైనల్ గా సుధీర్.. ఇతరుల నీడలో సుధీర్ ఉంటున్నాడని అమన్ నామినేషన్ చేశాడు. సొంత గేమ్ లేదని అమన్ ఆరోపించాడు. అయితే అమన్ ఆర్గ్యుమెంట్స్ ఏమాత్రం కన్విన్సింగ్ గా లేవు.. చాలా కన్ఫ్యూజ్డ్ గా అనిపించాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ శ్వేతా నాయుడు ఇచ్చిన ఇన్పుట్స్ తోనే అమన్ ఇలా మాట్లాడాడేమోనని హౌస్ లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ తో హౌస్ లో కొత్త శత్రుత్వాలు, కొత్త లెక్కలు మొదలయ్యాయి.




.webp)
.webp)
