Home

»

Tv News

Brahmamudi : లక్కీ కన్నతల్లి రేఖేనా.. ఆంటోని మైండ్ గేమ్!

May 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1033 లో.... నేనే నీ చెల్లి నందుని అని ఇందుతో నందు చెప్తుంది. దాంతో ఇందు పట్టరాని సంతోషంతో తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయం చెప్పలేదు.... అయిన ఎందుకు వెళ్లిపోయావని ఇందు అడుగుతుంది. ఆ రేఖ ఆంటీ పెట్టే టార్చర్ భరించలేక వెళ్ళిపోయాను.. ఎప్పటికైనా పోలీస్ అయి తిరిగి వచ్చి ఆ రేఖ ఆంటీ సంగతి చెప్పాలని అనుకున్నానని నందు చెప్తుంది. అవును నేను కూడా చిన్నప్పటి నుండి చాలా భరించాను..  అసలు ఈ పెళ్లి ఏంటి అక్క అని నందు అడుగుతుంది.  నీకు ఒక విషయం చెప్తాను ఎవరికి చెప్పొద్దని ఇందు మాట తీసుకుంటుంది. ఈ పెళ్లి అంతా నాటకం అని జరిగింది చెప్తుంది. ఇదంతా మన కుటుంబాన్ని, ఆస్తులని కాపాడడం కోసమే అని ఇందు చెప్తుంది. ముందు ఐశ్వర్యని మనవైపుకి తిప్పుకోవాలి అమ్మనాన్న కలని నెరవేర్చాలని ఇందు చెప్తుంది.

లోపలికి పదా నానమ్మ సంతోషపడుతుందని ఇందు అనగానే వద్దు అక్క నేను అనుకున్నది నెరవేరేవరకు నా గురించి ఎవరికి చెప్పకు అని నందు చెప్పగానే ఇందు సరే అంటుంది. మరొకవైపు ఆంటోనిని లక్కీ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. నేను బయటకు వచ్చాను కదా ఎక్కడ ఉందో వెతుకుతానని  చెప్పి ఆంటోని అంటాడు. ఆ తర్వాత లక్కీ జేబులో డబ్బు తీసుకుంటాడు. నీకు ఏది అడిగినా ఇస్తాను మా అమ్మ గురించి వెతుకమని లక్కీ చెప్పి వెళ్ళిపోతాడు. మీ అమ్మ గురించి చెప్తే నాకేం వస్తుందిరా.. ఇలా నువ్వు నాకు అడిగింది ఇస్తున్నావనుకొని.... తన జేబులో ఉన్న ఫోటోని చూసి.... నువ్వు నా పాలిట దేవతవమ్మ.. ఆ రోజు నువ్వు చేసిన పనికి వీడి దగ్గర డబ్బు తీసుకొని బ్రతికేస్తున్నానని గతంలో జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఆంటోని దగ్గరికి రేఖ వస్తుంది. ఈ బిడ్డ నాకు పుట్టినట్లు మా అమ్మకి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డానని రేఖ చెప్పగానే ఎందుకు మేడమ్ అని ఆంటోని అడుగుతాడు. నన్ను ప్రేమించిన వాడు నాకు నచ్చడం లేదు.. వాడికి పుట్టిన ఈ బిడ్డ నాకెందుకు....ఆ బిడ్డని ఆంటోనికి ఇస్తుంది రేఖ. ఏం చేస్తావో నాకు తెలియదు మళ్ళీ నా దగ్గరికి ఈ బిడ్డ రావద్దని రేఖ చెప్తుంది. ఆ విషయం ఆంటోని గుర్తుచేసుకొని నవ్వుకుంటాడు. లక్కీ తల్లి రేఖ అన్న విషయం ఆంటోనికి తెలుసు కానీ లక్కీకి ఆ విషయం చెప్పట్లేదు. మరొకవైపు రేఖ, భ్రమరాంబ, భూషణ్, శేషు అందరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆస్తులు మా పేరున ట్రాన్స్‌ఫర్ చేయండి అని లాయర్ తో రేఖ చెప్తుంది. అలాగే చేస్తాం కానీ ఇందుకి మ్యారేజ్ అయినట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంకా తన సంతకం తన భర్త సంతకం కావాలని అంటాడు.

ఆ తర్వాత ఇదెక్కడి ట్విస్ట్ అంటూ ఇంటికి వచ్చాక రేఖ, భ్రమరాంబ టెన్షన్ పడతారు. ఇప్పుడు వాడు సంతకం చెయ్యమంటే ఎందుకు చేస్తాడని భ్రమరాంబ అనగానే చేసేలా చేయాలి.. వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని రేఖ అంటుంది. మరొకవైపు పెళ్లి చేసుకున్నావ్ కనీసం చెప్పలేదని రాజుతో లక్కీ గొడవపడతాడు. అసలు రాజు చెప్పేది లక్కీ వినకుండా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com